Prabhas : ప్రభాస్ తో స్నేహం చేయడం వల్లే ఇండస్ట్రీ లో టాప్ పొజిషన్ లో ఉన్న కమెడియన్..

ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి హెల్ప్ అయిందనే చెప్పాలి. ఆయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో సత్తా చాటుకున్నాడు. ఇక ఆ తర్వాత తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు పైకెక్కుతూ ముందుకు సాగుతున్నాడు...

Written By: Gopi, Updated On : October 30, 2024 12:15 pm

The comedian who is in the top position in the industry is because of his friendship with Prabhas.

Follow us on

Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్న వారిలో ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా రేంజ్ ను దాటి పాన్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమాతో పాన్ వరల్డ్ లోకన్ ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈయన పాన్ ఇండియాలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. బాలీవుడ్ హీరోలు సైతం తన ముందు ఎందుకు పనికిరారు అనేంతలా గుర్తింపు అయితే సంపాదించుకుంటు ముందుకు సాగుతున్నాడు. ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు… ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల కొంతమంది నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధిస్తున్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు.
నిజానికి ప్రభాస్ శ్రీను లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి, ఆయన సక్సెస్ ఫుల్ గా రాణించడానికి ప్రభాస్ హస్తం చాలా ఉంది. ఇక వీళ్లిద్దరూ సత్యనంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నారు. అప్పుడు వీళ్ళ మధ్య మంచి బాండింగ్ ఏర్పడడంతో ప్రభాస్ శీను కొద్ది రోజులపాటు ప్రభాస్ డేట్స్ చూస్తూ ఉన్నాడు.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా మంచి కమెడియన్ గా కూడా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ శ్రీను తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేయడంలో ప్రభాస్ కీలకపాత్ర వహించాడు. ఇక అతనితో పాటుగా మరి కొంతమంది నటులు కూడా ప్రభాస్ ఫ్రెండ్స్ గా ఉండడం వల్లే ఇండస్ట్రీలో ఎదుగుతున్నారనే టాక్ అయితే ఉంది.
ఇక ఛత్రపతి శేఖర్ కూడా ప్రభాస్ కి మంచి ఫ్రెండు తన ప్రతి సినిమాలో అతనికి ఒక మంచి క్యారెక్టర్ ఉండే విధంగా డైరెక్టర్లతో మాట్లాడి క్యారెక్టర్ లను డిజైన్ చేస్తూ ఉంటాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ ఎక్కువ సినిమాల్లో ఛత్రపతి శేఖర్ నటించలేదు. ఏదైనా మంచి పాత్ర ఉంటేనే శేఖర్ ని ప్రిఫర్ చేస్తారని టాక్ అయితే వినిపిస్తుంది. మరి మొత్తానికైతే ప్రభాస్ వల్ల ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు..