Godavari Pushkaralu: ఏపీలో మరో వేడుకకు రంగం సిద్ధం అయ్యింది. కోట్లాదిమంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు చేశారు.పవిత్రగోదావరి పుష్కరాల్లో స్నానమాచరించడానికి కోట్లాదిమంది భక్తులు తరలివస్తారు.అందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు కార్యాచరణకు సైతం సిద్ధమయ్యింది.ఈసారి గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.తాజాగా పుష్కరాల నిర్వహణ కోసం పలు నిర్ణయాలు సైతం తీసుకున్నారు.2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు నిర్ణయించారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ఇప్పటినుంచి ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది.గత అనుభవాల దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ముందుగానే కార్యాచరణ ప్రారంభించింది.
* గత పుష్కరాల్లో విషాదం
2015లో టిడిపి ప్రభుత్వ హయాంలోనే గోదావరి పుష్కరాలు జరిగాయి.ఆ సమయంలో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.ఈసారి పుష్కరాల కోసం ఎనిమిది కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి 94 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.రెండున్నర సంవత్సరాల ముందే ఏర్పాట్లు ప్రారంభిస్తుండడం ఈసారి ప్రత్యేకత.మొత్తం యంత్రాంగం తో పాటు ప్రజాప్రతినిధులు సైతం ఇందులో భాగస్తులు కానున్నారు.
* యాక్షన్ ప్లాన్ సిద్ధం
గోదావరి పుష్కరాలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధమయింది.అందరూ ఒకే ఘాట్లో కాకుండా భక్తులు నచ్చిన చోట గోదావరి స్నానం చేయవచ్చు.దీనిపైనే విస్తృత ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మందివస్తారని అంచనా.మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు.యాత్రికుల బసపై కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.మొత్తం ఘాట్ల అభివృద్ధికి 904 కోట్ల రూపాయలతో బడ్జెట్ రూపొందించారు.రాజమండ్రి కార్పొరేషన్ రోడ్ల అభివృద్ధికి 456 కోట్లు, ఆర్ అండ్ బి రోడ్లు, బ్రిడ్జిల్లా అభివృద్ధికి 678 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సిటీ బ్యూటిఫికేషన్, ఐకానిక్ టూరిజం సైట్ ప్రాజెక్ట్ కోసం 75 కోట్లతో ప్రతిపాదించారు. త్వరలో సీఎం చంద్రబాబు పుష్కర ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.