https://oktelugu.com/

Rajamouli & Mahesh Babu :మహేష్ బాబు ను మరో లుక్ లోకి మారుస్తున్న రాజమౌళి…ఇక సినిమా చేసినట్టే..?

ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేస్తున్న ప్రతి దర్శకుడు సూపర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో కొంతమందికి ఇక్కడ మంచి గుర్తింపు అయితే వస్తుంది. ఇక మరి కొంతమందికి మాత్రం అసలు ఇక్కడ ఎలాంటి గుర్తింపు రావడం లేదు... ఇక ఏది ఏమైనా కూడా వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ ని అందుకోవాలనుకునే వాళ్ళు కొంచెం ఓపిగ్గా ఉంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది వస్తుందని సినిమా మేధావులు చెబుతున్నారు... అలాగే రాజమౌళి మాదిరిగా వరుస సక్సెస్ లు రావాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి అవసరం అయితే ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 23, 2024 / 01:12 PM IST

    Rajamouli who is changing Mahesh Babu into another look... like making another movie.

    Follow us on

    Rajamouli & Mahesh Babu :రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వచ్చే పాన్ వరల్డ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాని అనౌన్స్ చేసి దాదాపు సంవత్సరం పైన అవుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమాను సెట్స్ మీద తీసుకెళ్లడంలో రాజమౌళి మాత్రం ఎలాంటి అప్డేట్ ని ఇవ్వడం లేదు. మొత్తానికైతే ‘త్రిబుల్ ఆర్’ సినిమా రిలీజ్ అయి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా తను ఇప్పటివరకు ఈ సినిమాని మొదలు పెట్టకపోవడం అనేది దారుణమైన విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటికే మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ని కంప్లీట్ చేసి దాదాపు సంవత్సరం అవుతుంది. అయినప్పటికి అప్పటినుంచి ఇప్పటివరకు ఖాళీగానే ఉంటున్నారు. ఇక నిజానికైతే ఈ గ్యాప్ లో ఆయన మరొక సినిమా చేసి ఉండాల్సింది. కానీ రాజమౌళి పెట్టే కండిషన్స్ కి లోబడి ఆయన రాజమౌళితోనే ట్రావెల్ అవుతున్నాడు.
    ఇక అప్పటినుంచి ఇప్పటివరకు మహేష్ బాబు మీద రాజమౌళి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఒక దానిని మించిన ఒక మేకోవర్ లో మహేష్ బాబును డిఫరెంట్ అటెంప్ట్ లు చేయిస్తున్నాడు. ఇక ఇప్పటికే నాలుగు గెటప్పుల్లో మహేష్ బాబుని తయారుచేసిన రాజమౌళి మరోసారి మరొక లుక్ లో అతన్ని ప్రజెంట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజమౌళి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు.
    నిజానికి ఏదో ఒక లుక్ ముందే ఫిక్స్ అయిపోయి ఆ లుక్ లో మహేష్ బాబుని నిలిపితే బాగుంటుంది కదా! అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేసుకున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి తను అనుకున్నది వచ్చేంతవరకు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వడు. కాబట్టి ఈ విషయంలో కూడా తను కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు సాగుతున్నాడు. ఒక రకంగా మహేష్ బాబుకి ఇదంతా చిరాకు తెప్పిస్తుందని కొన్ని వార్తలను కూడా వస్తున్నాయి. నిజానికి కూడా రాజమౌళితో సినిమా చేయాలి అంటే చాలా ఓపిగ్గా ఉండాలి.
    ఎందుకంటే ఒక్కసారి ఆయన డైరెక్షన్ లో సినిమా వచ్చిందంటే వాళ్ళకి భారీ గుర్తింపురావడమే కాకుండా ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు మరొక లుక్కులో మహేష్ బాబుని తొందర్లోనే రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాని సంక్రాంతి నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నంలో రాజమౌళి బిజీ అవుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…