Telugu News » Photos » Cinema Photos » Rajamouli at the beginning of his career do you know who is the director who dominated
Rajamouli : కెరియర్ మొదట్లో రాజమౌళి ని డామినేట్ చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయడానికి ప్రయత్నం చేస్తున్న దర్శకుడు రాజమౌళి... 2001లో తన సినీ కెరియర్ ను స్టార్ట్ చేసిన రాజమౌళి అప్పటినుంచి ఇప్పటివరకు పెను సంచలనాలను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఒక సినిమాతో క్రియేట్ చేసిన రికార్డును మరొక సినిమాతో బ్రేక్ చేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్నాడు...
Rajamouli : స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన రాజమౌళి అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. బద్రి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో వరుస హిట్లు సాధిస్తూ వచ్చాడు. ఇక ఇదంతా బాగానే ఉంది కానీ మగధీర సినిమా వచ్చేంతవరకు రాజమౌళికి ఒక్క ఇండస్ట్రీ హిట్టు కూడా లేకపోవడం విశేషం…ఇక అప్పటికే పూరి జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్ పోకిరి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. రాజమౌళి మాత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి చాలా సంవత్సరాల సమయాన్ని తీసుకున్నాడు. ఇక 2000 సంవత్సరంలో పూరి జగన్నాథ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైతే 2006లో తన ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. కానీ రాజమౌళి మాత్రం 2001లో ఇండస్ట్రీకి వస్తే 2009 వ సంవత్సరంలో ఇండస్ట్రీ హిట్ కొట్టడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా అప్పట్లో రాజమౌళిని పూరి జగన్నాథ్ ఎప్పటికప్పుడు డామినేట్ చేస్తూనే వచ్చాడు. ఇక ఈ విషయాన్ని రాజమౌళి కూడా పలు సందర్భాల్లో ఒప్పుకున్నాడు.
మొత్తానికైతే రాజమౌళిని ఢీ కొట్టిన దర్శకులలో పూరి జగన్నాధ్ మొదటి స్థానంలో ఉంటాడు. పూరి జగన్నాధ్ సినిమాల్లో పెద్ద భారీ సెట్టింగ్లు ఏమీ ఉండవు, అలాగే గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా కావు. కానీ రెండు మూడు పంచు డైలాగులతో ఆయన సినిమా మీద భారీ బజ్ ను క్రియేట్ చేయగలుగుతాడు. అందుకే ఆయన సినిమాలకు ప్రేక్షకులా నుంచి విశేషమైన ఆదరణ అయితే ఉంటుంది.
ఇక ఏది ఏమైనా కూడా తనను తాను స్టార్ట్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో పూరి జగన్నాధ్ సక్సెస్ అయ్యాడు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన ఎనిమిది సంవత్సరాల తర్వాత రాజమౌళి ఇండస్ట్రీ హిట్టు కొట్టి నెంబర్ వన్ దర్శకుడిగా ఎదిగాడు అప్పటివరకు పూరి జగన్నాధ్ ఇండస్ట్రీ లో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతుండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా కెరియర్ మొదట్లో పూరి తనను తాను స్టార్ట్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నంత గొప్పగా రాజమౌళి మాత్రం ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాడు.
కానీ ఇప్పుడు మాత్రం ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా రాజమౌళి కొనసాగడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అప్డేట్ అవ్వకపోవడం వల్లే తను ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోయే దశకు చేరుకున్నాడు. కానీ రాజమౌళి మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ భారీ సక్సెస్ ను సాధిస్తూ వస్తున్నాడు…