Film industry : సినిమా ఇండస్ట్రీ లో థియేటర్ల కొరత తీరదా..? ప్రతి పండక్కి ఈ గొడవ ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఒక సినిమా తీయదం ఎంత ముఖ్యమో ఆ సినిమాను సరైన సమయం లో రిలీజ్ చేయడం కూడా అంతే ముఖ్యం...లేకపోతే మాత్రం ఆ సినిమాకి అనుకున్న ఆదరణ అయితే దక్కదు. దానికోసమే మన దర్శక నిర్మాతలు పండుగ సీజన్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు...

Written By: Gopi, Updated On : October 30, 2024 12:10 pm

Is there a shortage of theaters in the film industry? What is this fight for every festival..?

Follow us on

Film industry : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండుగ సీజన్ వచ్చిందంటే చాలు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ భారీ రచ్చని క్రియేట్ చేస్తూ ఉంటాయి. నిజానికి ఒక స్టార్ హీరో సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమాను చూసి వాళ్ళు ఎంటర్ టైన్ అవ్వడానికి విపరీతమైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. నిజానికి ఇంకా వాళ్ళ అభిమాన హీరో సినిమా వచ్చిందంటే మాత్రం ఎలాగైనా సరే మొదటి రోజు ఆ సినిమా చూడడానికి వాళ్ళు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఒక సమస్య అయితే విపరీతంగా ఎదురవుతూనే ఉంది. అది ఏంటి అంటే థియేటర్ల సమస్య… పండగ సీజన్ వచ్చిందంటే చాలు కొంతమంది ప్రొడ్యూసర్లు వాళ్ళ ఆధిపత్యంలో ఉన్న సినిమా థియేటర్లను వాళ్లే ఆపుకొని వాళ్ల సినిమాలను వాళ్లే రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. దీని వల్ల కొంతమంది మీడియం రేంజ్ హీరోలు గాని, చిన్న సినిమాలను రిలీజ్ చేసే ప్రొడ్యూసర్లకి గాని విపరీతమైన ఇబ్బందులైతే ఎదురవుతున్నాయి. మరి ఈ గుత్తాధిపత్యం పట్ల ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్ ను వ్యక్తం చేయకపోవడంతో ఈ ఆధిపత్యం అనేది ఇలాగే కొనసాగుతూ వస్తుంది. గత రెండు మూడు సంవత్సరాల నుంచి కొంత మంది ప్రొడ్యూసర్లు హీరోలు ఈ విషయం మీద భారీగా రెస్పాండ్ అవుతున్నారు. అయిన వాళ్ళు చేసేది ఏమీ లేకుండా పోతుంది.
అయితే ఆ స్టార్ ప్రొడ్యూసర్లు థియేటర్లను వాళ్ళ ఆధిపత్యం లో పెట్టుకోవడమే కాకుండా వాళ్ళు మంచి థియేటర్లను తీసుకొని డొక్కు థియేటర్లని మిగితా వాళ్ళకి ఇస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనివల్ల ఆ థియేటర్లకి జనాలు వెళ్ళడానికి సాహసం చేయరు. మంచి థియేటర్లోనే సినిమాలను చూడాలని కోరుకుంటారు.
 కాబట్టి ఎటు చూసిన వాళ్ల సినిమాలకు మాత్రమే ప్లస్ అయ్యే విధంగా చూసుకుంటున్నారు అంటూ టాప్ ప్రొడ్యూసర్ల మీద కొంతమంది ఫైర్ అవుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టే విధంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు భారీ ప్రణాళికలను రూపొందించడం లేదా అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని ఓవర్ కమ్ చేయాలని చూసినప్పటికి అది చెరగని ఒక సమస్యగానే మిగిలిపోతుంది.
తప్ప దాన్ని సాల్వ్ చేసే వాళ్ళు ఎవరూ లేకుండా పోతున్నారనే ఆవేదనను చిన్న ప్రొడ్యూసర్లు అయితే వ్యక్తం చేస్తున్నారు… చూడాలి మరి ఈ సమస్య ఇంకెన్ని రోజులపాటు సినిమా ఇండస్ట్రీ ని వేదిస్తుంది అనేది…