https://oktelugu.com/

Chiranjeevi : చిరంజీవి రేంజ్ ను టచ్ చేయలేకపోయిన సీనియర్ స్టార్ హీరోలు…కారణం ఏంటి..?

ప్రతి సినిమా విషయంలో హీరోలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతారు. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ఆ సినిమాకి అన్ని క్రాఫ్ట్ ల వాళ్ళు హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏ ఒక్కరు చిన్న మిస్టేక్ చేసినా కూడా ఆ సినిమాకి అనుకున్నంత ఆదరణ అయితే దక్కకపోవచ్చు...

Written By:
  • Gopi
  • , Updated On : October 30, 2024 / 12:03 PM IST

    Senior star heroes who could not touch Chiranjeevi's range...what is the reason..?

    Follow us on

    Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. దాదాపు 40 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీ ని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న ఈ హీరో నుంచి ఒక సినిమా వచ్చిందంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈయన చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఎవరికి దక్కని ‘మెగాస్టార్ ‘ అనే బిరుదును కూడా ఆయన సంపాదించుకున్నాడు అంటే ఆయన కృషి, పట్టుదల ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందిన బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి వాళ్లు సైతం చిరంజీవి స్టార్ స్టేటస్ ని బీట్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేశారు అయినప్పటికి వాళ్ళు వెనకబడిపోయారనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ వరుస సక్సెస్ లను సాధిస్తూ డిఫరెంట్ మూవీస్ ని చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. అందువల్ల ఆయన ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు. ఇక తనను టచ్ చేసే హీరో లేకపోవడంతో ఇండస్ట్రీని శాసించే హీరోగా ఎదిగాడు.

    ఇక ఎప్పటికప్పుడు మిగతా హీరోలు ఆయనను బీట్ చేయాలనే ప్రయత్నం చేసినప్పటికి ఆయన మాత్రం ఎవ్వరికి అందనంత ఎత్తులో వరుస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాడు. ముఖ్యంగా ఆయన ఎంచుకునే స్టోరీలు గానీ, ఆ సినిమాను సరైన విధంగా డైరెక్షన్ చేసే దర్శకులను తీసుకోవడంలో ఆయన ముందు వరుసలో ఉంటాడు. టాలెంట్ ఉన్నవాళ్లను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. అందువల్లే చిరంజీవి కూడా భారీ గా ఎలివేట్ అయ్యాడు.

    ఇక మిగతా వాళ్ళను కూడా మంచి గుర్తింపు వచ్చేలా ప్రోత్సహిస్తు వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇచ్చాడు.ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి స్టార్ హీరో ఇప్పటికీ తనదైన రీతిలో సినిమాలను చేస్తున్నాడు అంటే ఆయన డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక ఇప్పుడున్న యంగ్ హీరోలు సైతం ఫైట్స్ అంటే భయపడిపోతున్న సమయంలో సీనియర్ హీరో అయిన చిరంజీవి డూప్ లేకుండా కూడా కొన్ని ఫైట్లు చేస్తున్నాడు అంటే సినిమా అనేది ఆయనలో ఎంత మమేకం అయిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు…

    మొత్తానికైతే అయితే చిరంజీవి ప్రస్తుతం విశ్వభర సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాతో కనక ఆయన సక్సెస్ ని సాధిస్తే ఆయన రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…