grossing Telugu movie : ఈ సంవత్సరం లో అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు సినిమా అదేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దిగ్గజ దర్శకులు ఉన్నారు నిజానికి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ అంతకంతకు ఎదుగుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ సంవత్సరం కూడా అలానే భారీ సక్సెస్లను సాధిస్తూ ముందుకు వెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి...

Written By: Gopi, Updated On : October 26, 2024 9:32 am

Is that the highest grossing Telugu movie of this year?

Follow us on

grossing Telugu movie : 2024 వ సంవత్సరంలో చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సంవత్సరం ముగియడానికి మరొక రెండు నెలల సమయం మాత్రమే ఉన్న నేపధ్యంలో ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. అయితే ఈ సంవత్సరం ఇప్పటివరకు వచ్చిన పెద్ద సినిమాల్లో భారీ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన సినిమాలు ఏంటి? చిన్న సినిమాల్లో ఏ సినిమాలు వండర్స్ ని క్రియేట్ చేశాయి. అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…ఇక పెద్ద సినిమాల విషయానికి వస్తే ఈ సంవత్సరం నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలందరు వాళ్ళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే వీటిలో కొన్ని సినిమాలు సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి ‘సినిమా మాత్రం ఇప్పటివరకు రిలీజైన అన్ని సినిమాల్లో భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను నమోదు చేసుకుంది. 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఈ సినిమా విజువల్ వండర్ గా కూడా నిలిచింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన దేవర సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి ఆ సినిమా కూడా సక్సెస్ ని అందుకుంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ డిసెంబర్ 5 వ తేదీన పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకైతే ప్రభాస్ ఈ సంవత్సరం కల్కి సినిమాతో ఒక రికార్డ్ ను  సృష్టించి టాప్ లెవల్లో ఉన్నాడు. ఇక పుష్ప 2 సినిమా ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఇప్పటివరకు రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో ‘హనుమాన్ ‘ సినిమా భారీ రికార్డ్ ను క్రియేట్ చేసింది…ఈ సినిమా 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచింది…ఏది ఏమైనా మన స్టార్ హీరోలు పాన్ ఇండియాలో వరుస సక్సెస్ లను సాధించడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే మనవాళ్లు చేస్తున్న ప్రతి ప్రయత్నం సక్సెస్ ఫుల్ గా నిలవడంతో తెలుగు సినిమాల మీద ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఆడియన్ కి కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. మన సినిమాలు చూడడానికి ప్రేక్షకులు అలాగే  మన సినిమాల మీద ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయడానికి ప్రొడ్యూసర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాలను చూసి మన వాళ్ళని ఇంకా బాగా ఆదరించాలని కోరుకుందాం…