https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : యష్మీ కి మానసికంగా నరకం చూపిస్తున్న నిఖిల్.. ఒక రేంజ్ లో డబుల్ గేమ్స్ ఆడుతున్నాడుగా!

ఈ వారం మొత్తం ఆమె డిప్రెషన్ లోనే ఉండిపోయింది, ఒక్క గేమ్ కూడా సరిగా ఆడలేకపోయింది, ఇలాగే ఉంటే టాప్ 5 కి వెళ్లడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు.

Written By:
  • Vicky
  • , Updated On : October 26, 2024 / 09:36 AM IST
    Follow us on

    Bigg Boss Telugu 8 :  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్స్ ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల చుట్టూ తిరగడం, అబ్బాయిలు మాకు ఇష్టం లేదు అన్నట్టుగా ప్రవర్తించడం ఈ సీజన్ లోనే చూస్తున్నాము. విష్ణు ప్రియ పృథ్వీ ని, యష్మీ నిఖిల్ ని ఇష్టపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పృథ్వీ విష్ణు కి నో చెప్పేసాడు, వాళ్ళ మధ్య ఒక క్లారిటీ ఉంది. కానీ నిఖిల్ మాత్రం యష్మీ కి ఎస్ చెప్పడం లేదు, అలా అని నో కూడా చెప్పడం లేదు. కాసేపు ఆమెతో ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తాడు, కాసేపు నాకు ఇష్టం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తాడు. అసలు నిఖిల్ ఉద్దేశ్యం ఏమిటో యష్మీ కి మాత్రమే కాదు, చూసే ఆడియన్స్ కి కూడా అర్థం కావడం లేదు. మనసులో ఒకటి ఉంచుకొని బయటకి మరోలా నాటకాలు ఆడుతున్నడని అందరికీ అర్థం అవుతుంది.

    నిన్న యష్మీ నిఖిల్ తో మాట్లాడుతూ ‘నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం’ అని అంటుంది. అప్పుడు నిఖిల్ నా వెంట నిన్ను తిప్పుకుంటుంటే మజా వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతాడు. కానీ పక్క రోజు నుండి తనకి ఇలాంటి రిలేషన్స్ వంటివి ఇష్టం లేనట్టుగా వవహరిస్తాడు. యష్మీ కి ఇక ఇలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఆ స్థానంలో యష్మీ కి మాత్రమే కాదు, ఎవరు ఉన్నా నరకం గానే ఉంటుంది. నిన్న కూడా నా మీద అంచనాలు పెంచుకోవద్దు అని నీకు చెప్పాను కదా అని యష్మీ తో అంటాడు. దానికి యష్మీ ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ప్రేరణ తో మాట్లాడుకుంటున్న సమయం లో నిఖిల్ ప్రవర్తన గురించి చెప్తూ బాధపడుతుంది. మొన్న విష్ణు ప్రియకి నీ గురించి ఏమని చెప్పాడు అని ప్రేరణ యష్మీ ని అడగగా, యష్మీ మాట్లాడుతూ ‘గత వారం నేను గౌతమ్ తో డ్యాన్స్ వేసాను కదా, దానికి నిఖిల్ చాలా అసూయ పడ్డాడు అట. నేనంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు అసూయ పడాలి? , ఇలా చాలా ఉన్నాయి. వాడు కెమెరాల ముందు మంచోడు అవుదామని నటిస్తే నటించమను,, నేనైతే ఇలాగే నిజాయితీగా ఉంటా’ అని చెప్పుకొచ్చింది.

    అయితే యష్మీ కూడా ఈమధ్య చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. గత వారం వరకు ఆమె ఫోకస్ మొత్తం గేమ్ మీదనే ఉండేది. కానీ ఈ వారం మొత్తం ఆ ఫోకస్ పోయింది, నిఖిల్ జపం చేస్తూ అతని వెనుకే తిరుగుతూ ఉంది. యష్మీ ఏంటి ఇలా అయిపోయింది అని ఆమె అభిమానులు కూడా ఫీల్ అయిపోతున్నారు. నిఖిల్ మీద ఇష్టం ఉంటే బయటకి వెళ్లిన తర్వాత చూసుకుంటా, హౌస్ లోకి తీసుకొచ్చి అతని గేమ్ ని, నా గేమ్ ని డిస్టర్బ్ చేసుకోను అని పృథ్వీ తో ఒకసారి అంటుంది. కానీ చివరికి జరుగుతున్నది ఏమిటి?, ఆమె నిఖిల్ పై ఈమె ప్రభావం ఏమి పడలేదు, కానీ ఈమె గేమ్ ని మాత్రం నాశనం చేసుకుంటుంది. ఈ వారం మొత్తం ఆమె డిప్రెషన్ లోనే ఉండిపోయింది, ఒక్క గేమ్ కూడా సరిగా ఆడలేకపోయింది, ఇలాగే ఉంటే టాప్ 5 కి వెళ్లడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు.