Akhira Nandan : ఓజీ లో అఖిరా నందన్ నటిస్తున్నాడా..? క్లారిటీ ఇచ్చిన సుజీత్…
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్లు చాలావరకు ప్రయోగాత్మకమైన సినిమాలను చేసే సక్సెస్ లను సాధిస్తున్నారు. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా వాళ్ళకంటు ఒక సపరేట్ మార్కును కూడా క్రియేట్ చేసుకుంటున్నారు...
Written By:
Gopi, Updated On : October 29, 2024 2:41 pm
Follow us on
Akhira Nandan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన దైన రీతిలో సినిమా చేయడమే కాకుండా ఆయనకంటూ ఒక భారీ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఆయన చేసిన సినిమాలు ఒక్కప్పుడు సూపర్ సక్సెస్ అవుతూ వచ్చాయి. ఇక అదే రీతిలో ఇప్పుడు సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ఓజీ సినిమా విషయంలో కూడా ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాని 60% పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ తొందర్లోనే ఈ సినిమా సెట్స్ లోకి వచ్చి సినిమాను పూర్తిగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కొడుకు అయిన అకీరా నందన్ కూడా నటిస్తున్నాడనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి. నిజానికి అఖిలానంద ఈ సినిమాలు నటిస్తున్నాడా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన పేరు అయితే సినిమా ఇండస్ట్రీలో భారీగా వినిపిస్తుంది. ఇక తొందర్లోనే అకిరా నందన్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.
ఇక ఈ విషయం మీద సుజిత్ మాట్లాడుతూ ఈ సినిమాలో అకిరా నందన్ నటించడం లేదననే విషయం పైన క్లారిటీ వచ్చే విధంగా కొన్ని మాటలైతే మాట్లాడాడు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తన దైన రీతిలో సత్తా చాటుకుంటున్న సమయంలో ఓజీ సినిమా అతన్ని మరొక మెట్టు పైకి ఎక్కించే విధంగా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో యూత్ లో గాని, ఫ్యామిలీ ఆడియన్స్ లో గాని భారీ క్రేజ్ సంపాదించుకోబోతున్నాడు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన మొత్తానికైతే ఒక వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు రెండింటికి సమపాలల్లో న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడనే చెప్పాలి.
కొద్దిరోజుల్లోనే సెట్స్ మీద ఉన్న మూడు సినిమాలను కంప్లీట్ చేసి ఆయన మరికొన్ని కొత్త సినిమాలకు కమిట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దాని కోసమే ఆయన అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏపీ ప్రజల కష్టాలను తెలుసుకొని వాటికి సరైన పరిష్కారం చూపించడంలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటున్నాడు. అందువల్లే ఆయన సక్సెస్ అవుతూ వస్తున్నాడనే చెప్పాలి…