https://oktelugu.com/

Nandamuri family : నందమూరి ఫ్యామిలీ నుంచి ఇంకా ఎంత మంది ఎన్టీయార్లు వస్తారు సామి…

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి సినిమా మీద ఒక ప్యాషన్ ఉండి నటించే సత్తా ఉన్న నటులకు మాత్రమే ఇక్కడ స్టార్ హీరోగా ఎదిగే అవకాశం అయితే ఉంటుంది... ఇక ఏది ఏమైనా కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉన్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 11:51 am
    How many more NTRs will come from Nandamuri family Sami...

    How many more NTRs will come from Nandamuri family Sami...

    Follow us on

    నందమూరి ఫ్యామిలీకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు వేసిన బాటలోనే వాళ్ల ఫ్యామిలీ మొత్తం నడుస్తుందనే చెప్పాలి. ఇక రెండవ తరం నందమూరి ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఆయన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే సూపర్ సక్సెస్ లను అందుకుంటూ తాతకు తగ్గ మనవడిగా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే మరొక ఇద్దరు ఎన్టీఆర్లు నందమూరి ఫ్యామిలీ నుంచి అరంగెట్రం చేయబోతున్నారనే విషయం మనకు తెలిసిందే. అందులో బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ ఒకరు కాగా, మరొకరు హరికృష్ణ మనవడు నందమూరి జానకి రామ్ కొడుకు అయిన నందమూరి తారక రామారావు కావడం విశేషం… ఇక వీళ్లంతా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటాలని చూస్తున్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అనే పేర్లు ఎక్కువగా వినిపించబోతున్నాయనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఇంతకుముందు కూడా నందమూరి తారకరత్న కూడా తన పేరు ఎన్టీఆర్ గా పెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి అరంగ్రేటం చేశాడు.

    ఇక ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే 9 సినిమాలకు కమిటై తన సత్తా ఏంటో నిరూపించుకోవాలనే ప్రయత్నం చేశాడు. కానీ కాల క్రమేణ ఆయనకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆయన హీరోగా ఇండస్ట్రీ నుంచి ఫెయిడౌట్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం ఆయన గత రెండు సంవత్సరాల క్రితం మరణించిన విషయం కూడా మనకు తెలిసిందే.

    ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ పేరు ప్రస్తుతానికి అలా ఉన్నప్పటికీ స్క్రీన్ నేమ్ గా ఆయన పేరుని మార్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ అనే పేరు వచ్చేలా తన పేరుని వేయించుకోవాలని చూస్తున్నాడట. ఇక అతనితోపాటు హరికృష్ణ మనవడు అయిన నందమూరి తారక రామారావు కూడా వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాతోనే ఆయన ఇండస్ట్రీకి అరంగేట్రం చేస్తున్న నేపధ్యం లో ఇప్పుడు ఆయన్ మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

    ఇక ఇండస్ట్రీలో ఇప్పుడు ఎటు చూసిన ఎన్టీఆర్లే కనిపిస్తుండటం విశేషం… మరి ఈ పేరు ఇంతటితో ఆగిపోకుండా ఫ్యూచర్ లో మరికొంతమంది కూడా ఎన్టీఆర్ పేరుతో నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఇప్పుడు వచ్చే ఈ ఎన్టీఆర్లు ఎలా రాణిస్తారు అనేది…