Chiranjeevi : చిరంజీవి కోసమే రాసుకున్న ఈ రెండు 2 సినిమాలను మిస్ చేసుకున్నాడు…ఇంతకీ ఆ సినిమాలు ఏంటి? అవి హిట్టా? ఫట్టా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు మంచి సినిమాలను చేసి స్టార్ స్టేటస్ ని అందుకున్న దర్శకులు తమను తాము ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకున్నారు...

Written By: Gopi, Updated On : October 30, 2024 1:00 pm

He missed these 2 movies written for Chiranjeevi...so what are those movies? Are they a hit? free?

Follow us on

Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అనే పదానికి ఒక ప్రత్యేకమైన హోదా ఉంది. ఆయన నుంచి ఒక సినిమా వచ్చింది అంటే చాలు సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుందనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇక సినిమా హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా భారీ క్రేజ్ ను సంపాదించుకొని సూపర్ సక్సెస్ గా నిలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు చేసిన కొన్ని సినిమాలు అతనికి మంచి సక్సెస్ లను అందించాయి. అయితే చిరంజీవి కోసం రాసుకున్న రెండు స్టోరీలను వేరే హీరోలు చేయడం అనేది చిరంజీవి అభిమానులను నిరాశపరిచిందనే  చెప్పాలి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి చిరంజీవికి కథలను వినిపించిన దర్శకులు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…
ఒకప్పుడు చిరంజీవి వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాడు. అయితే అప్పుడు ఆయన రెస్టు లేకుండా సినిమా షూటింగ్లో పాల్గొంటూ చాలావరకు తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బి గోపాల్ ఏంటో డైరెక్టర్ చిరంజీవి కోసం రాసుకున్న ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సినిమాని చిరంజీవి బిజీగా ఉండడం వల్ల దాన్ని రిజెక్ట్ చేశాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే రౌడీ ఇన్స్పెక్టర్…ఇక చిరు ఈ కథను రిజెక్ట్ చేయడం తో ఈ సినిమాని బాలయ్య బాబుతో రౌడీ ఇన్స్పెక్టర్ పేరు తో చేసి బి గోపాల్ సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. నిజానికైతే బి గోపాల్ ఈ సినిమాని మొదట చిరంజీవి కోసమే అనుకున్నారట.
కానీ అక్కడ వీలు కాకపోవడంతో బాలయ్య బాబుని పెట్టి అతని ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులను చేసి ఈ సినిమాని చేశారట. దాంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక చిరంజీవి ఆ తర్వాత కొన్ని పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ల సినిమాలు చేసినప్పటికీ అంత పెద్దగా ప్రభావం అయితే చూపించలేకపోయాడు…
ఇక దాంతో పాటుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన శివమణి సినిమాని కూడా మొదట చిరంజీవికి వినిపించారట. కానీ చిరంజీవికి ఆ క్యారెక్టరైజేషన్ అంత బాగా నచ్చలేదట. ఎందుకంటే ఒక స్టార్ స్టేటస్ లో ఉన్న చిరంజీవి ఆ ఏజ్ లో అలాంటి డైలాగులు చెప్పడం అతనికి కొంచెం ఇబ్బందిగా అనిపించడంతో ఆ కథను రిజెక్ట్ చేసినట్టుగా కూడా పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…ఇక మొత్తానికైతే ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించాయి. చిరంజీవి రెండు సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడనే చెప్పాలి…