Telugu News » Photos » Cinema Photos » Dulquer salmaan is getting ready for a movie with trivikram will this hero settle in telugu
Trivikram & Dulquer Salmaan : త్రివిక్రమ్ తో సినిమాకి రెడీ అవుతున్న దుల్కర్ సల్మాన్…ఈ హీరో తెలుగులోనే సెటిల్ అవుతాడా..?
మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం సినిమాలు ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నాడు. ఇక ఆయన చేసిన 'గుంటూరు కారం' సినిమా రిలీజ్ అయి దాదాపు సంవత్సరం కావస్తున్నప్పటికి ఇప్పటివరకు ఆయన నుంచి మరొక సినిమా అయితే రాలేదు. ఇక అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నప్పటికి ఆ ప్రాజెక్టు ఇంకా అనౌన్స్ మెంట్ అయితే రావడం లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమంది కుర్ర హీరోలతో ఆయన సినిమాలు చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది...
Written By:
Gopi, Updated On : October 29, 2024 2:28 pm
Follow us on
Trivikram & Dulquer Salmaan : మమ్ముట్టి కొడుకుగా మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ ఆ తర్వాత ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజీల్లో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఒక భాషకి పరిమితం అవ్వకుండా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఆయన తెలుగులో రెండు మూడు సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి ‘లక్కీ భాస్కర్’ పేరుతో ఈ పండక్కి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. మరి ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమా మాత్రం తప్పకుండా ఉంటుందంటూ వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక నాగ వంశీ ప్రొడ్యూసర్ గా చేయబోయే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా కనిపించబోతున్నడట. మరి త్రివిక్రమ్ ఇప్పుడు తన పంథా మార్చి డిఫరెంట్ కథలను రాస్తున్నాడు.
ఎందుకంటే తను రాసే రెగ్యూలర్ రొటీన్ కథలకు కాలం చెల్లిందనే విషయం ఆయనకు కూడా అర్థమైపోయింది. ఇక గుంటూరు కారం ప్లాప్ తో ఆయన చాలావరకు నష్టపోయాడు. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలంటే ఇప్పుడున్న యూత్ ఎలా అయితే ఆలోచిస్తున్నారో అలాంటి ఆలోచనతోనే ఒక మంచి కథను రెడీ చేసుకుని సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా తనను తాను స్టార్ డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో మాత్రం త్రివిక్రమ్ ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూనే వస్తున్నాడు. మరి ఇప్పుడు కూడా తనదైన రీతిలో సినిమా చేసి ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వాటికి సరైన కన్ క్లూజన్ అయితే రావడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎలాంటి సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తాడనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.