Pushpa 2 : పుష్ప 2 సక్సెస్ అయితే సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటాడో తెలుసా..?

తెలుగు సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న దర్శకులు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న సుకుమార్ లాంటి దర్శకుడు ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు...తనను తాను ప్రూవ్ చేసుకుంటూ తన ప్రతి సినిమాలో డీటెయిలింగ్ ను ఎక్కువగా రాయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక అందువల్లే ఆయన చాలా ఉన్నత శిఖరాలకు ఎదిగాడు...

Written By: Gopi, Updated On : October 28, 2024 4:31 pm

Do you know how much Sukumar's remuneration will be if Pushpa 2 is a success?

Follow us on

Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్…తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమాతో అటు అల్లు అర్జున్, ఇటు సుకుమార్ ఇద్దరూ కూడా పాన్ ఇండియాలో పాగా వేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే సుకుమార్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా సక్సెస్ కనక సాధిస్తే తను 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేయడానికి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని హీరోలందరూ వెయిట్ చేస్తున్న క్రమంలో తను చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతుండటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక కెరియర్ మొదట్లో తన ఇంటిలిజెంట్ ని వాడిన దర్శకుడు విచిత్రమైన సీన్స్ ను రాసుకునేవాడు. కానీ రంగస్థలం సినిమాతో మాస్ యాంగిల్ కి వచ్చి మంచి విజయాన్ని సాధించాడు. ఇక ఆ తర్వాత పుష్ప సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘ పుష్ప 2’  సినిమాతో మరోసారి సక్సెస్ సాధిస్తే కనక తనకు ఇక పాన్ ఇండియాలో తిరుగు లేదనే చెప్పాలి.
ఎలాగైనా సరే ఈ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలపడమే తన లక్ష్యంగా పెట్టుకొని చాలా ఎక్కువ కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయిన ఇప్పటికీ సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంటున్నాడు. ఈ సినిమాలో ఏ ఒక్క చిన్న ఫ్రేమ్ కూడా తేడాగా ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన భారీ కసరత్తులు చేస్తున్నాడు.
మరి ఈ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో చేయబోయే సినిమాకు దాదాపు 100 కోట్ల రెమ్యూనరేషన్ అయితే తీసుకోబోతున్నాడు అంటూ కొన్ని  వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి సుకుమార్ తన తదుపరి ప్లానింగ్ ఎలా వేసుకుంటున్నాడు అనేది…