https://oktelugu.com/

Avesham : అవేశం సినిమా రీమేక్ లో మొదట ఆ స్టార్ హీరోను అనుకున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక స్పెషల్ స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకుంటే పర్లేదు. ఇక చేసుకోకపోతే మాత్రం ఇక్కడ ఎవరు పట్టించుకోరు...

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2024 / 01:41 PM IST

    Did you think of that star hero first in the remake of Avesham?

    Follow us on

    Avesham : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు… ప్రస్తుతం బాలయ్య తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు బాలయ్య బాబుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనతో సినిమాలు చేస్తే మాస్ సినిమాలు చేయడమే కాకుండా బీ, సీ సెంటర్లో ఉన్న ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చనే ఉద్దేశ్యంతో చాలామంది దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఆయన ఎక్కువగా మాస్ సినిమాలు చేస్తుంటారు. కాబట్టి ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ ను క్రియేట్ చేయడంలో బాలయ్య బాబు ఎప్పుడు సక్సెస్ సాధిస్తూనే వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ రెండు సినిమాల తర్వాత మరొక సినిమా కూడా చేయబోతున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు స్ట్రెయిట్ సినిమాలె ఎక్కువగా చేస్తూ ఉంటాడు.

    ఇక అప్పుడప్పుడు రీమేక్స్ చేసిన కూడా వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడనేది మరొకసారి తను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న హీరో ఫాహద్ ఫజిల్..ఈయన హీరోగా ‘ఆవేశం ‘ అనే సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా అక్కడ మలయాళంలో సూపర్ సక్సెస్ అయింది.

    దాంతో తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను రాబట్టింది. మరి ఇలాంటి ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. అయితే రవితేజతో రీమేక్ చేస్తున్న ఈ సినిమాని మొదట బాలయ్య బాబు దగ్గరికి తీసుకొచ్చారట. కానీ బాలయ్య బాబుకి ఈ రీమేక్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం. అందులోనూ ఇలాంటి కథను తను చేయలేనని చెప్పాడట. దాంతో సినిమా మేకర్స్ మళ్లీ డైలమా లో పడిపోయి కొద్ది రోజుల తర్వాత రవితేజ తో కాంటాక్ట్ అయి అతనితో ఇప్పుడు ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    మరి ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య రూటే సపరేటు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అతను రీమేక్ సినిమాలు చేస్తాడు కానీ తనకు నచ్చితేనే చేస్తాడు అని చెప్పడంలో ఈ విషయాన్ని మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు…