https://oktelugu.com/

Nitin : నితిన్ ను పరిచయం చేసిన దర్శకుడి తోనే ఆయనకి మాటలు లేవా..? వీళ్ల మధ్య గొడవకి కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలైతే పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మరి వాళ్లకు పాన్ ఇండియాలో అంత మంచి క్రేజ్ దక్కుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 6, 2024 / 02:35 PM IST

    Did he have no words with the director who introduced Nitin? What is the reason for the fight between them?

    Follow us on

    Nitin : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న హీరో నితిన్… తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేస్తున్నాయి. తద్వారా ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగే దిశగా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన మొదటి సినిమా అయిన జయం సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకు స్టార్ హీరో ఇమేజ్ ని కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక మొత్తానికైతే జయం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నితిన్ ఆ తర్వాత వరుస విజయాల పరంపరని కొనసాగించాడు. ఇక ఒకానొక సందర్భంలో ఆయనకు వరుసగా 13 ఫ్లాపులు వచ్చినప్పటికి ఆయన ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతూ వచ్చాడు. తద్వారా ఆయన ఇష్క్ సినిమాతో మరోసారి సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నాడు.

    ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు విపరీతంగా అలరిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆయనతో మొదటి సినిమా తీసిన తేజ తో ఆయనకి కొన్ని విబేధాలు వచ్చాయనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక జయం సినిమా తర్వాత వీళ్ళిద్దరూ కాంబినేషన్ లో ధైర్యమనే సినిమా వచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది.

    నిజానికి ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించేది. కానీ డైరెక్టర్ తేజ అనుకున్న కొన్ని సీన్లను తీయడానికి నితిన్ వాళ్ళ నాన్న ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన సుధాకర్ రెడ్డి ఆ సీన్లకు పర్మిషన్స్ ఇవ్వలేదట. ఇక ప్యాచ్ వర్క్ కూడా చేయడానికి మరికొన్ని రోజుల సమయం తీసుకోవాలని తేజ అనుకున్నప్పటికి వాళ్లు అంతగా పట్టించుకోకపోవడంతో ఈ సినిమాని హడావిడిగా రిలీజ్ చేశారు. దానితో సినిమా ఫ్లాప్ అయింది. ఇక అప్పటినుంచి తేజ కి, నితిన్ కి మధ్య చిన్న విబేధాలు రావడంతో వాళ్ళు మాట్లాడుకోవడం లేదనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి.

    ఇక మొదటి సినిమాతో సక్సెస్ ని అందించిన స్టార్ డైరెక్టర్ తో నితిన్ మాట్లాడడం లేదనేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొంతవరకు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏది ఏమైనా కూడా ఇద్దరు తమదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దుసుకెళ్ళడం అనేది మంచి విషయమనే చెప్పాలి…