https://oktelugu.com/

IIFA Event : మహేష్,అల్లు అర్జున్ పై తేజ సజ్జ,రానా దగ్గుబాటి సెటైర్లు..’గుంటూరు కారం’ ని ఇరగ కుమ్మేశా అంటున్న తేజ సజ్జ!

రీసెంట్ గా తేజ సజ్జ, రానా దగ్గుబాటి కూడా మహేష్ బాబు ని ఒక రేంజ్ ట్రోల్ చేసారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే అబుదాబి లో IIFA ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్ కి అన్ని ఇండస్ట్రీల నుండి దిగ్గజ నటులు, సూపర్ స్టార్స్ హాజరు కాగా, తేజ సజ్జ మరియు రానా దగ్గుబాటి హోస్టులు గా వ్యవహరించారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 6, 2024 / 02:20 PM IST

    IIFA Event

    Follow us on

    IIFA Event :  ఈమధ్య కాలం లో మహేష్ బాబు అభిమానులకు వరుసగా అవమానాలు ఎదురు అవుతూ ఉన్నాయి. ఇటీవలే హైదరాబాద్ లో దేవి శ్రీ ప్రసాద్ ఏర్పాటు చేసిన లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ లో తాను పని చేసిన స్టార్ హీరోలందరి పాటలు పాడాడు కానీ, మహేష్ బాబు పాటలను మాత్రం పూర్తిగా పక్కన పడేసాడు. దీనికి మహేష్ బాబు అభిమానులు చాలా బాధపడ్డారు. సోషల్ మీడియా లో దేవిశ్రీప్రసాద్ ని ట్యాగ్ చేసి అడ్డమైన బూతులు తిట్టారు. కనీసం దేవి శ్రీ ప్రసాద్ వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పాలని కోరారు, కానీ దేవిశ్రీ ప్రసాద్ అసలు పట్టించుకోలేదు. తన పనిని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా తేజ సజ్జ, రానా దగ్గుబాటి కూడా మహేష్ బాబు ని ఒక రేంజ్ ట్రోల్ చేసారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే అబుదాబి లో IIFA ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్ కి అన్ని ఇండస్ట్రీల నుండి దిగ్గజ నటులు, సూపర్ స్టార్స్ హాజరు కాగా, తేజ సజ్జ మరియు రానా దగ్గుబాటి హోస్టులు గా వ్యవహరించారు.

    ఈ ఈవెంట్ లో వీళ్లిద్దరు మన స్టార్ హీరోలందరిపై వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి. ముఖ్యంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ ని ఒక రేంజ్ లో రోస్ట్ చేసి వదిలారు. ముందుగా రానా మాట్లాడుతూ ‘కాంట్రవర్సీలకు దూరంగా ఉండే మనిషి, కోట్లాది అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టే అందగాడు, ది లవర్ బాయ్, ది యాక్షన్ స్టార్, ది వన్ & ఓన్లీ’ అని చెప్పబోతుంటే, తేజ సజ్జ మధ్యలో కలగచేసుకొని ‘నా గురించి ఇంత బిల్డప్స్ ఇవ్వడం అవసరమా’ అని అంటాడు. అప్పుడు రానా నేను చెప్తుంది నీ గురించి కాదురా, మహేష్ బాబు గురించి అని చెప్తాడు. మరి నా గురించి చెప్తున్నట్టే అనిపిస్తుందేంటి అని తేజ సజ్జ అనగా, దానికి రానా కౌంటర్ ఇస్తూ ‘అవును నిజమే కదా..అతను చైల్డ్ ఆర్టిస్టు, నువ్వు కూడా చైల్డ్ ఆర్టిస్టు. అతను సూపర్ స్టార్, నువ్వు సూపర్ హీరో, ఇద్దరు సంక్రాంతికే వచ్చారు’ అని అంటాడు. అప్పుడు తేజ సజ్జ ‘ఏయ్..సంక్రాంతి గురించి మాట్లాడకు’ అని అంటాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

    ఈ సంక్రాంతికి ఏమి జరిగిందో మన అందరికీ తెలిసిందే. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్ చిత్రాలు విడుదలయ్యాయి. చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచి, మహేష్ బాబు ‘గుంటూరు కారం’ వసూళ్లను కూడా దాటేసింది. దీంతో సోషల్ మీడియా లో మహేష్ బాబు పై విపరీతమైన ట్రోల్స్ పడ్డాయి. నేషనల్ లెవెల్ లో ఈ అంశం ట్రెండ్ కూడా అయ్యింది. దీనిపై వీళ్లిద్దరు ట్రోల్స్ పంచే ఈయడం మహేష్ అభిమానులకు నచ్చలేదు. కేవలం మహేష్ బాబు మీద మాత్రమే కాదు అల్లు అర్జున్, ప్రభాస్, బాలయ్య మీద కూడా అనేక పంచులు వేశారు. కానీ అవన్నీ ఫన్నీ గా ఉండగా, మహేష్ బాబు ని మాత్రం వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు చూసేవాళ్లకు అనిపించింది. ఈ గొడవ ఎంత దూరం వరకు వెళ్తుందో చూడాలి.