https://oktelugu.com/

Kanguwa : ‘కంగువ’ ని చూసి దేవి శ్రీ ప్రసాద్ ని బూతులు తిడుతున్న ఆడియన్స్..’పుష్ప 2′ నుండి అందుకే పీకేసారా?

సుమారు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత తమిళ హీరో సూర్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 'కంగువ' చిత్రంతో నేడు భారీ అంచనాల నడుమ మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే

Written By:
  • Vicky
  • , Updated On : November 14, 2024 4:13 pm
    Audiences who are booing Devi Sri Prasad after watching 'Kanguwa'.

    Audiences who are booing Devi Sri Prasad after watching 'Kanguwa'.

    Follow us on

    Kanguwa :  సుమారు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత తమిళ హీరో సూర్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘కంగువ’ చిత్రంతో నేడు భారీ అంచనాల నడుమ మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా ఫ్లాప్స్ ని అందుకుంటూ మార్కెట్ ని పాడు చేసుకుంటున్న సూర్య, ఈ సినిమాతో భారీ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడని అందరూ ఊహించారు. కానీ విడుదలైన మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ రావడం సూర్య అభిమానుల్ని తీవ్రమైన నిరాశకు గురి చేసింది. సినిమా స్టోరీ, కాన్సెప్ట్ మొత్తం బాగానే ఉంది కానీ, డైరెక్టర్ శివ స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ విషయం లో తడబాటు పడినట్టుగా అనిపించిందని ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్నారు. కేవలం రెండు మూడు సన్నివేశాలు తప్ప, ఫ్యాన్స్ ని అలరించలేకపోయింది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా గాడి తప్పిందని, ఇదేమి సినిమా రా బాబు అని అనేక సందర్భాలలో అనిపించిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్తున్నారు.

    ఇదంతా పక్కన పెడితే సినిమా ఒకవేళ యావరేజ్ రేంజ్ లో ఉన్నప్పటికీ, మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తే, ఫలితాలు అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకు రీసెంట్ ఉదాహరణ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం. సినిమా యావరేజ్ గా ఉన్నప్పటికీ, అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రం ఫలితాన్నే పూర్తిగా మార్చేసింది. ఫుల్ రన్ లో దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిల్చింది. ఇప్పుడు కంగువ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలన్నా కూడా 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాలి. సూర్య తన అద్భుతమైన నటనతో ప్రతీ సన్నివేశాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసాడు. కానీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సరైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వకపోవడం వల్ల ఆ సన్నివేశాలు తేలిపోయాయి.

    అనేక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా లౌడ్ గా, చిరాకుగా అనిపించింది. కొన్ని సన్నివేశాల్లో అయితే నాసిరకం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా బాగాలేదు అని చెప్తూ, నెగటివ్ పాయింట్స్ చెప్పే ప్రతి ప్రేక్షకుడు కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అసలు బాగాలేదు అనే చెప్తున్నాడు. దీనిని బట్టి దేవి శ్రీ ప్రసాద్ పూర్తిగా ఫామ్ ని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. అందుకే ఆయన్ని పుష్ప 2 నుండి డైరెక్టర్ సుకుమార్ పీకేశారు. దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్స్ ఒక్కటి కూడా సుకుమార్, అల్లు అర్జున్ లను ఆకట్టుకోలేదట. అందుకే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం థమన్ ని పిలిపించుకున్నారు. ఇలా ఒక సినిమాకి నెగటివ్ టాక్ ఈ రేంజ్ లో రావడానికి ఈయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన కారణం అనే టాక్ బాగా విస్తరించడంతో దేవిశ్రీ ప్రసాద్ కి ఇక మీదట అవకాశాలు రావడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు.