https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ కెరియర్ ను నిలబెట్టిన ఇద్దరు స్టార్ డైరెక్టర్లు వీళ్లేనా..?

అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. స్టార్ హీరోగా వెలుగొందుతున్న ఈయన ఇప్పుడు చేస్తున్న సినిమాల మీదనే చాలా ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ ని కూడా క్రియేట్ చేస్తున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : November 6, 2024 / 09:34 AM IST

    Are these the two star directors who supported Allu Arjun's career?

    Follow us on

    Allu Arjun : స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోలలో తను కూడా ఒకడిగా మారడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. గంగోత్రి సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా సాగుతూ ఉండటం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని ఆనందానికి గురిచేసి అంశమనే చెప్పాలి. ఇక ఆ సినిమా సక్సెస్ అయినప్పటికి ఆయనకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఆ తర్వాత సుకుమార్ తో చేసిన ఆర్య సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన యూత్ లో మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించినప్పటికి ఆయనకు స్టార్ డమ్ అయితే తీసుకురాలేకపోయాయి. ఇక ఎప్పుడైతే త్రివిక్రమ్ తో ఆయన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం లో సినిమాలు చేశాడో అప్పాడు ఆయన క్రేజ్ తారా స్థాయికి వెళ్ళిపోయింది. ముఖ్యంగా అలా వైకుంఠపురం లో సినిమా మాత్రం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్టు కొట్టడంతో ఆయన తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. అందుకే అల్లు అర్జున్ లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా గర్వకారణమనే చెప్పాలి. ఆయన వేసే డ్యాన్సులు గాని, ఆయన చెప్పే డైలాగులు గాని ప్రేక్షకులను అమితంగా ఇష్టపడేలా చేస్తున్నాయి.

    ఇక మొత్తానికైతే పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి తన ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ ఎంటైర్ కెరియర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడు సినిమాలు చేసి ఆయనకు భారీ సక్సెస్ లను అందించగా, సుకుమార్ కూడా ఇప్పటికి రెండు సినిమాలతో సక్సెస్ లను అందించి ఇప్పుడు మూడో సినిమాతో మరొక సక్సెస్ ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

    ఇక ఈ సక్సెస్ తో ఎలాగైనా సరే పాన్ ఇండియాలో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడంలో అల్లు అర్జున్ చాలా వరకు మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

    ఇక మొత్తానికైతే ఇప్పుడు తనకంటూ పాన్ ఇండియాలో ఒక స్పెషల్ ఐడెంటిటీ అయితే ఉంది. మరి దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తే మాత్రం అల్లు అర్జున్ ఫ్యూచర్ లో చాలా మంచి గుర్తింపు ఉంటుంది. లేకపోతే మాత్రం మళ్ళీ ఆయన డౌన్ ఫాల్ అవ్వాల్సిన అవసరమైతే ఏర్పడుతుంది…