Amaran : అమరన్ ట్రైలర్ ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు..?ఆర్మీ ఆఫీసర్ సినిమాలు తెలుగులో ఆడుతాయా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కమల్ హాసన్ తర్వాత అంత మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వరుస సినిమాలను చేసుకుంటూ తమిళ్, తెలుగు లో చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న నటుడు శివ కార్తికేయన్...

Written By: Gopi, Updated On : October 24, 2024 8:26 am

What did the director want to say through the trailer of Amaran? Will army officer movies play in Telugu?

Follow us on

Amaran : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన సినిమాలను తీయడంలో మంచి పేరు సంపాదించుకున్న హీరోల్లో శివ కార్తికేయన్ ఒకరు… ఈయన చేసే సినిమాల్లో చాలావరకు కొత్తదనం అయితే ఉంటుంది. నిజానికి ఈయన డిఫరెంట్ సినిమాలను చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఒకే జానర్ లో సినిమాలు చేయడానికి ఇష్టపడడు. ఇక శివ కార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ ప్రొడ్యూసర్ గా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం లో వస్తున్న అమరన్ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా భారీ లెవెల్లో చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ ట్రైలర్ ని కనక మనం ఒకసారి చూసినట్లైతే ఈ సినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఈ సినిమాను ఆయనకు డెడికేట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సినిమా ద్వారా శివ కార్తికేయన్ ఒక డిఫరెంట్ పాత్రలో నటించడమే కాకుండా ఆర్మీ ఆఫీసర్ గా తనను తాను స్క్రీన్ మీద ప్రజెంట్ చేసుకున్న విధానం కూడా చాలా అద్భుతంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక శివ కార్తికేయన్ ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఆయన భార్య సాయి పల్లవి నటించింది. మొదట వీళ్ళ మధ్య ఉండే ప్రేమ అనుబంధాలను చూపిస్తూనే ఆ తర్వాత వీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పిల్లాడి కోరిక మేరకు ఆర్మీలో ఉద్యమం చేస్తున్న ముకుంద్ తిరిగి ఇంటికి వచ్చాడా లేదా అనే కథాంశాన్ని చాలా క్యూరియాసిటీతో తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది.

ఇక అందులో ఎమోషన్స్ ను కూడా యాడ్ చేసి చాలా ఉత్తమంగా ఈ సినిమాను తీసినట్టుగా తెలుస్తోంది. ఇక జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా బాగా ప్లస్ అవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమా ద్వారా తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా కొత్త సబ్జెక్టులను డీల్ చేయడంలో శివ కార్తికేయన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడనేది మరోసారి చాలా స్పష్టంగా తెలియజేయబోతున్నాడు…అలాగే ఈ సినిమా ద్వారా దర్శకుడు ఆర్మీ మేజర్స్ కష్టాలు ఎలా ఉంటాయి. వాళ్ల ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు అనేది కూడా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక దానికోసమే ఈ సినిమాలో కొంచెం ఫిక్షన్ కథ ను కూడా ఆడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడి వరకు ఒకే కానీ మరి ఓవర్ మెలో డ్రామా గా ఉంటే మాత్రం ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంత బాగా నచ్చకపోవచ్చు.

ఇక కమల్ హాసన్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ కథ విన్న వెంటనే ఆయన తనే స్వయంగా ప్రొడ్యూస్ చేస్తానని డైరెక్టర్ కి చెప్పారట. మరి మొత్తానికైతే దేశభక్తితో తెరకెక్కుతున్న ఈ సినిమాని చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనే చెప్పాలి. ఇక దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…