https://oktelugu.com/

Allu Arjun & NTR : ఆ విషయం లో ఎన్టీయార్ ను తొక్కేసిన అల్లు అర్జున్…ఇది మరి దారుణం…

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న స్టార్ హీరోలందరు గుర్తొస్తుంటారు. నిజానికి మన స్టార్ హీరోలు తెలుగులోనే కాకుండా పాన్ ఇండియాలో వాళ్ళ సత్తాను చాటుతూ ముందుకు సాగుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 22, 2024 / 11:03 AM IST

    Allu Arjun who trampled NTR in that matter...this is worse...

    Follow us on

    Allu Arjun & NTR : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుందనే చెప్పాలి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలందరూ ఎవరికి వారు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్న హీరోలు సైతం తమ మార్కెట్ ను పెంచుకొని మరి గ్రాండ్ విక్టరీని సాధించాలని చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ఆ సినిమాతో పాజిటివ్ టాక్ సంపాదించుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అటు ఎన్టీఆర్ కి, ఇటు కొరటాల శివకి మంచి గుర్తింపునైతే తీసుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న ‘పుష్ప 2’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక పుష్ప సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఈ కాంబో మరోసారి అంతకుమించి సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమాతో ఎన్టీఆర్ సాధించిన ఫీట్ కంటే అల్లు అర్జున్ తన ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ అవ్వకముందే ఎన్టీఆర్ ని తీసి పక్కన పెట్టేసినట్టుగా చేశాడు.
    ఇంతకీ ఏం జరిగిందంటే దేవర సినిమా రైట్స్ కేరళ లో కేవలం రెండు కోట్ల రూపాయలకు అమ్ముడు పోతే పుష్ప 2 సినిమా కేరళ రైట్స్ మాత్రం 20 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం…ఇక దీనిని బట్టి చూస్తే కేరళలో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ కంటే అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ చాలా ఎక్కువని ఈజీగా అర్థమైపోతుంది.
    అలాగే ఈ విషయంలో ఎన్టీఆర్ ని తొక్కేసిన అల్లు అర్జున్ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన కథనాలైతే వస్తున్నాయి. ఇక దేవర సినిమా దాదాపు 500 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇప్పుడు దేవర సినిమాను తొక్కేస్తూ పుష్ప 2 సినిమా వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుంది అంటూ అల్లు అర్జున్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
    ఇక ఎన్టీఆర్ అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులకు మధ్య ఫ్యాన్ వార్ అనేది తరచుగా జరుగుతూనే ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…