Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ప్రేక్షకులకు ఓ పిచ్చి. ఆయన సినిమాలంటే అంతగా రియాక్ట్ అవుతుంటారు. ఆయన నటనకు ఫిదా అవుతారు. పవన్ సినిమా అంటే పండుగే. ఆయనకున్న అభిమానులు మరే హీరోకు లేరంటే అతిశయోక్తి కాదు. పవన్ అంటే ఓ శక్తి. అలాంటి పవన్ కల్యాణ్ తో సినిమా అంటే భారీ బడ్జెట్ కావాలి. ఒక్క రోజు షూటింగ్ కు మామూలుగా రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. అంతటి భారీ బడ్జెట్ అవసరం అవుతుంది. అందుకే పవన్ సినిమాను ఒక రోజు కూడా ఆలస్యం కాకుండా షూటింగ్ జరుపుతారు.
జూనియర్ ఆర్టిస్టులు, టెక్నికల్ వాళ్లు, దర్శకులు, ఆర్ట్ వాళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని శాఖల వారికి నిత్యం డబ్బులు చెల్లించాల్సిందే. దీంతో నిర్మాతకు భారీ బడ్జెట్ అవుతుంది. అందుకే సినిమా షూటింగ్ వాయిదా పడితే నిర్మాతకు నష్టమే. ఇప్పుడు పవన్ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. దీంతో శరవేగంగా షూటింగులు జరిగితేనే త్వరగా సినిమాలు పూర్తవుతాయనే ఉద్దేశంతో పవన్ కూడా క్రమం తప్పకుండా షూటింగులకు హాజరవుతున్నాడు.
Also Read: Sarkaru Vaari Paata: సర్కారివారి పాట వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
ప్రస్తుతం శ్రీసూర్యా మూవీస్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు క్రిష్ దర్శకత్వలో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి నటిస్తోంది. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కూడా బిజీగా ఉండటంతో అప్పుడప్పుడు షూటింగులు రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో నిర్మాతకు నష్టం వస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగులు నిర్విరామంగా జరిగితేనే నిర్మాతలకు ప్రయోజనం ఉంటుంది.
ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన పాత్ర పోషిస్తుండటంతో ఎన్నికల నాటికి వీలైనన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసమే సినిమాల నిర్మాణంలో వేగం పెంచాలని అనుకుంటున్నా అప్పుడప్పుడు సభలకు హాజరు కావడంతో షూటింగులకు విరామం ఇవ్వాల్సి వస్తోంది. దీంతో నిర్మాతలకు ఇబ్బంది అవుతోంది. కానీ వీలైనంత వరకు షూటింగులకు ఎగ్గొట్టకుండా చూడాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Amala- Naga Chaitanya: నాగచైతన్య తల్లి పై అక్కినేని అమల కామెంట్స్ వైరల్
Recommend Videos
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Pawan movie shooting is canceled will all the lakhs be lost
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com