Omicron In India: మన దేశంలో ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ వచ్చేసిందని పలువురు అంటున్నారు. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కొవిడ్ కేసుల వలన ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే, కరోనా సెకండ్ వేవ్‌తో పోల్చితే ఇప్పటి పరిస్థితులు కొంత అదుపులోనే ఉన్నాయని కొందరు వైద్య నిపుణులు చెప్తున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన వారు మూడు లేదా నాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నారని, కానీ, ఆ తర్వాత వారిని కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయని వైద్యనిపుణులు వివరిస్తున్నారు. అత్యధిక శాతం మంది ఒమిక్రాన్ వేరియంట్ వలన గొంతు సమస్యలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి లక్షణాలు తగ్గుముఖం పడుతున్నాయి కూడా. కానీ, ఒళ్లు నొప్పులు, నీరసం మాత్రం ఇంకా కొద్ది రోజుల పాటు అలానే ఉండిపోవడం జరుగుతున్నది. అయితే, ఈ విషయమై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లక్షణాలకు అనుగుణం గా మందులు వాడితే సరిపోతుందని పేర్కొంటున్నారు.
కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడి కోలుకున్న తర్వాత ఒకవేళ దగ్గు తీవ్రత పెరిగినట్లయితే వైద్యుడిని సంప్రదించడం మేలని అంటున్నారు. అతి తక్కువ మందిలో ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తుల వరకు రీచ్ అవుతున్నదని, కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలా అని చెప్పి అజాగ్రత్తగా ఉన్నా కుదరదని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: Kitchen Tips For Omicron: ఈ వంటింటి చిట్కాలతో ఒమిక్రాన్ నుంచి త్వరగా కోలుకుంటారు..
కరోనా సెకండ్ వేవ్ కంటే చాలా భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయని ఫలితంగా ప్రజలు మరీ అంతలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు పెద్దలు. ఒమిక్రాన్ లో కనిపిస్తున్న లక్షణాలకు గతంలో మాదిరిగా పెద్ద పెద్ద మందులు కూడా వాడటం లేదు. పారాసిటమాల్ ట్యాబ్లెట్స్‌తోనే మ్యాగ్జిమమ్ సొల్యూషన్ లభిస్తున్నదని, మరీ తీవ్రత ఎక్కువ ఉంటేనే ఇతర మందుల వాడకంపైన దృష్టి పెడుతున్నారు. ఇకపోతే ఈ వైరస్ బారిన పడిన వారు ఎక్కువగా ఆస్పత్రికి కూడా వెళ్లడం లేదు. ఇంటి వద్దే ఉండి తమకు తాముగా వైద్యం చేసుకుంటున్నారు. మరీ తీవ్రత ఎక్కువగా ఉంటేనే హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. ఇకపోతే ఇప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నిటిలోనూ ఎక్కువ శాతం వైరస్ గొంతు వరకే పరిమితమవుతున్నది. దాంతో జనం మరీ అంత ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
Also Read: Omicron: ఒమిక్రాన్ బయట ఎన్ని గంటలు బతికి ఉంటుందో తెలుసా?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Omicron variant symptoms are bothering
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com