Zhang Xueqiang: కష్టపడితే కోట్ల సంపాదించొచ్చు అని కొందరు అంటూ ఉంటారు. కానీ మన దేశంలో చాలామంది కాస్త అదృష్టం కూడా ఉండాలని భావిస్తారు. ఎంత కష్టపడినా ఎలాంటి ఆదాయం రాదని.. అదృష్టం ఉంటే ఓవర్ నైట్ లో కోట్లు సంపాదించవచ్చని అనుకుంటారు. అదృష్టం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ కొందరు కష్టాన్ని నమ్ముకున్న వారు ఈ సమయంలో కోటీశ్వరులుగా మారుతుండారు. అయితే జీవితమంటే ఎప్పుడు ఒకేలా ఉండదు ఒక్కోసారి తీవ్ర నష్టాల్లో కూరుకుపోవచ్చు. ఇలాంటి సమయంలో తీవ్ర ఆవేదన చెందుతూ కూర్చునే వారే ఎక్కువగా ఉంటారు. ఈ సమస్య నుంచి బయటపడి కోట్లు సంపాదించేవారు తక్కువమందే ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఓ చైనా యువకుడు ఏం చేశాడో తెలుసా..
ప్రతి ఒక్కరి జీవితం పూల పాన్పు కాదు. ఒక్కోసారి డబ్బు రావచ్చు.. ఒక్కోసారి తీవ్ర నష్టాలకు గురి కావచ్చు. కానీ రెండు పరిస్థితులను ఎదుర్కొనే సమర్థత కచ్చితంగా ఉండాలి. అప్పుడే జీవితంలో అనుకున్నది సాధించవచ్చు. ఈ విధంగా చైనాకు చెందిన Zhang Xueqiang అనే యువకుడు ఓ రెస్టారెంట్ ను ప్రారంభించాడు. అయితే ఇది తీవ్ర నష్టాలకు గురైంది. ఈ క్రమంలో అతడు కోట్ల రూపాయల అప్పులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ సమయంలో అతడు కుంగిపోలేదు. తనకు వచ్చిన పని చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ మిగతా వారి కంటే కాస్త ఎక్కువగా కష్టపడాలని అనుకున్నాడు.
అలా Zhang ఫుడ్ డెలివరీ బాయ్ గా జీవితాన్ని ప్రారంభించాడు. అయితే అందరిలాగా చేస్తే తనకు వచ్చే జీతం తక్కువ అని భావించి.. కాస్త ఎక్కువగా పనిచేసేవాడు. ప్రతిరోజు 20 గంటల పాటు పనిచేయ సాగాడు. వీకెండ్ లో ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా ఫుడ్ డెలివరీ చేస్తూనే ఉన్నాడు. అలా ఏమాత్రం విశ్రాంతి లేకుండా పని చేయడంతో అతడు మొత్తంగా 1.42 కోట్లను సేవ్ చేశాడు. అయితే అంతకుముందే అతడు కోట్ల రూపాయల అప్పుల్లో చిక్కుకున్నా.. వాటిని తీర్చి అదనంగా కోట్లను వెనుకేసుకున్నాడు. మిగతా వారిలాగా ఇతనికి ఎలాంటి లాటరీ తగలలేదు.. అదృష్టం వరించలేదు.. అతడు చేసిందల్లా ఒకటే.. తీవ్రంగా కష్టపడడం.. వచ్చిన డబ్బులను పొదుపు చేయడం.. ఎలాంటి దుబారా ఖర్చులు చేయకపోవడం.. జల్సాలకు అలవాటు పడకపోవడం.. ఈ విధంగా Zhang తన కష్టానికి ఫలితంగా కోట్ల రూపాయలను పొందాడు. దీంతో అతడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.
డబ్బు చాలామంది సంపాదిస్తారు. కానీ కష్టపడితే కచ్చితంగా విజయం సాధిస్తారు అన్నదానికి ఈ యువకుడే ఆదర్శం. నేటి కాలంలో చాలామంది డబ్బు అధికంగా సంపాదించాలని అనుకుంటారు కానీ ఎలాంటి కష్టం ఉండొద్దని భావిస్తారు. కష్టం లేకుండా అనుకున్న డబ్బు సంపాదించలేరు అనడానికి ఈయనే నిదర్శనం.