Woman Stops Accident With Saree: రైలు ప్రయాణం చేయడం అంటే కొందరికి మహా ఇష్టం. కానీ రైలు ప్రమాదాలను చూస్తే అందులో ఎక్కడానికి కొంతమంది భయపడిపోతూ ఉంటారు. రైలు ప్రమాదాలే కాకుండా రైల్వే ట్రాక్ పై ఏర్పడిన సమస్యలతో కూడా ట్రైన్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అయితే రైల్వే ట్రాక్పై సమస్యలను గుర్తించడానికి రైల్వే సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. అయినా కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ పాడైపోయి ఉంటాయి. వీటిని కొందరు గుర్తించి పట్టించుకోరు. కానీ వీటిని గుర్తించడం వల్ల ఎన్నో ప్రాణాలను నిలపవచ్చని విషయం కొంతమందికి అర్థం కాదు. అయితే 60 ఏళ్ల మహిళ ఈ సమస్యను గుర్తించి వందల మంది ప్రాణాలను కాపాడింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎట్టా జిల్లాకు చెందిన గులేరియా గ్రామంలోని ఓంవతి దేవి అనే మహిళ ఎప్పటిలాగే వ్యవసాయ పనులకు ఓ రోజు వెళ్ళింది. అయితే తన పొలం రైల్వే ట్రాక్ సమీపంలో ఉండడంతో రైల్వే ట్రాక్ ను దాటాల్చి వచ్చింది. ఇలా రైల్వే ట్రాక్ను దాటుతుండగా రైలు పట్టాలు విరిగినట్లు గుర్తించింది. అయితే ఈ సమాచారాన్ని అధికారులకు స్పందించడానికి తన వద్ద ఎటువంటి సౌకర్యాలు లేవు. కానీ ఇంతలోనే అటువైపు ట్రైన్ వచ్చేసి శబ్దాన్ని విన్న ఓంవతి దేవి కి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో తాను కట్టుకున్న ఎర్ర చీరను తీసేసి రెండు కట్టలను తీసుకుంది. రెండు కట్టెలను రైల్వే ట్రాక్ కు రెండువైపులా ఏర్పాటు చేసి చీరను రైలు పట్టాలకు అడ్డంగా కట్టేసింది.
ఇదే సమయంలో అటువైపు వచ్చిన రైలు లోని పైలట్ ఆ చీరను గుర్తించారు. దీంతో లోకో పైలట్ రైలును ఆపివేశారు. ఆ తర్వాత ట్రైన్ దిగి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత రైలు పట్టాలు విరిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా అక్కడికి ఓంవతి దేవి వచ్చి అసలు విషయాన్ని చెప్పారు. అయితే ఈ విషయాన్ని అధికారులు రైల్వే సిబ్బందికి తెలిపి రైల్వే ట్రాక్ను మరమ్మతులు చేయించారు.
Also Read: Virata Parvam Real Story: విరాటపర్వం అసలు కథ ఇదే.. సాయిపల్లవి పాత్ర క్లైమాక్స్ షాకింగ్
ఏదైనా ప్రమాదం ఎదురైతే తనకెందుకులే అని అనుకుంటున్నా ఈ రోజుల్లో 60 ఏళ్ల ఓ మహిళ ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వాస్తవానికి రైల్వే ట్రాక్ పాడైపోయిన విషయం అధికారులకు తెలిపే విషయం ఆమెకు తెలియదు. అలా తెలిపిన అధికారులు ఈ స్థలానికి వచ్చేసరికి సమయం పట్టేది. కానీ వెంటనే ఓంవతి దేవి అప్రమత్తమై రైలును ఆపే ప్రయత్నం చేయడంపై చాలామంది ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. అయితే ఓంవతి దేవి రైల్వే ట్రాక్ ధ్వంసమైన విషయాన్ని గుర్తించకపోతే పెను ప్రమాదం సంభవించేదని అంటున్నారు. సాధారణంగా సినిమాల్లో మాత్రమే జరిగే ఇలాంటి సంఘటన నిజజీవితంలో జరగడంపై ఆ మహిళ గురించి అందరూ చర్చించుకుంటున్నారు.