Viral Video Grandpa: ఒకప్పుడు మద్యాన్ని చాటుమాటుగా తాగేవారు. పైగా మద్యం కూడా చాలా మితంగానే అందుబాటులో ఉండేది. ఒక మోస్తరు పట్టణాలు, నగరాలలో మాత్రమే వైన్ షాపులు ఉండేవి. ఆ షాపులు కూడా పరిమిత గంటలలో మాత్రమే తెరుచుకునేవి.
మద్యం తక్కువగా అందుబాటులో ఉండేది కాబట్టి గ్రామాలలో సారా తయారీ ఎక్కువగా ఉండేది. అయితే సారా ను కొంతమంది మాత్రమే విక్రయించేవారు. ఇక అప్పట్లో సారా తాగే వారి సంఖ్య తక్కువగానే ఉండేది. కాలక్రమంలో ప్రభుత్వాలు మద్యం మీద ఆధారపడటం పెరిగిపోయింది. మద్యం ద్వారా వచ్చే ఆదాయం తోనే సంక్షేమ పథకాలు అమలు చేసే స్థాయికి పరిస్థితి దిగజారింది. ప్రభుత్వాల మీద ఆర్థిక ఒత్తిడి పెరిగిన ప్రతి సందర్భంలోనూ మద్యం ధరలను పెంచడాన్ని నాయకులు అలవాటు చేసుకున్నారు.. దీంతో మందుబాబులు తమ జేబులు గుల్లలు చేసుకుని.. ఆరోగ్యాన్ని పాడుచేసుకుని.. ప్రభుత్వాలకు ఆదాయాన్ని అందిస్తున్నారు. సినిమాలలో మాదిరిగా వారిని ట్యాక్స్ పేయర్లు అని చెప్పవచ్చు.
ప్రభుత్వం వైన్ షాపుల ద్వారా మద్యాన్ని అమ్మడం మొదలు పెట్టిన తర్వాత గ్రామాలలో సారా తయారీ పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఇటీవల కాలంలో మద్యం ధరలు అమాంతం పెరిగిన నేపథ్యంలో మళ్లీ సారా తయారీ ఊపందుకుంది. తెలంగాణలో సారా తయారీ అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ.. సమీప రాష్ట్రాలలో మాత్రం సారా తయారీ బీభత్సంగా సాగుతోంది. దీంతో ఈ దందాకు చెక్ పెట్టడానికి సరిహద్దుల ప్రాంతాల్లో తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రాంతాలలోకి పొరుగు రాష్ట్రాలలో నుంచి సారా రాకుండా అడ్డుకుంటున్నారు. అయితే తాజాగా మహారాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు. అలా ఒక వృద్ధుడిని పోలీసులు తనిఖీ చేయగా దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.
మామూలుగా దోవతి, తెలుపు రంగు అంగీ వేసుకుని.. నెత్తికు రుమాలు ధరించి మహారాష్ట్ర నుంచి ఒక వ్యక్తి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే దూరం నుంచి చూస్తే అతడు సాధారణ వృద్ధుడి లాగానే కనిపిస్తున్నాడు. పోలీసులకు అనుమానం వచ్చి అతని ఆపారు. అతనిని తనిఖీ చేశారు ఏమీ కనిపించలేదు. ఎటువంటి వస్తువు కూడా దొరకలేదు. చివరికి ఒక పోలీసు అధికారికి అనుమానం వచ్చి మళ్లీ అతడిని ఆపాడు. ఈసారి అతడి చొక్కాను పరిశీలించాడు. చొక్కా విప్పమని ఆదేశించాడు. ఆ వృద్ధుడు మొదట దీనికి నిరాకరించాడు. ఆ తర్వాత అతడు చొక్కా విప్పితే పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. ఆ వృద్ధుడు చొక్కా విప్పిన తర్వాత అతడి శరీరం చుట్టూ మొత్తం సారా ప్యాకెట్లు కనిపించాయి . ఒక్కో ప్యాకెట్లో తక్కువలో తక్కువ పావు లీటర్ వరకు సారా ఉంది. ఆ సారా ప్యాకెట్లను తెలంగాణలో విక్రయించడానికి వెళ్తున్నట్టు ఆ వృద్ధుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ సారా వ్యాపారం ద్వారానే భారీగా సంపాదిస్తున్నట్టు వెల్లడించాడు.. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ఆ వృద్ధుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
View this post on Instagram