Wife Turns Into Snake At Night: భార్యాభర్తలకు సంబంధించిన హాట్ టాపిక్స్ ఇటీవల ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చి ఆశ్చర్యాన్ని కలగజేస్తున్నాయి. కొందరు భార్యలు భర్తలపై దాడి చేయడం.. మరికొందరు వారికి దూరంగా ఉండేందుకు రకరకాలుగా ప్రయత్నించడం వంటివి వింటున్నాం. తాజాగా ఓ భర్తను భయపెడుతున్న భార్య గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన భార్య రాత్రి నాగుపాములా మారి బుస కొడుతోందని కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు భర్త. ఆయన ఫిర్యాదును చూసి అధికారులు షాక్ కు గురయ్యారు. అయితే ఆయన అలా ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది?
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మహముదాబాద్ జిల్లా పరిధిలోని లోథ్సా అనే గ్రామానికి చెందిన meraz అనే వ్యక్తి ఇటీవల కలెక్టరేట్లో నిర్వహించిన ‘ సమాధాన్ దివస్’ అనే కార్యక్రమంలో అర్జీ పెట్టుకున్నాడు. ఆ రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించేందుకు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి సమాధాన్ దివస్ నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా meraz ఇటీవల ఒక ఆర్జీ పెట్టుకున్నాడు. ఇందులో ఆయన “నా భార్య నసీమున్ రాత్రి అయితే చాలు పాముల మారిపోతుంది. నన్ను కాటు వేయడానికి వెంటాడుతుంది. బుసలు కొడుతూ నాగినిలా డాన్స్ చేస్తుంది.. నా భార్య నుంచి నన్ను కాపాడండి.. ఆమె నుంచి నాకు ప్రాణహాని ఉంది”అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా ప్రతిసారి తనను కాటు వేసేలా దాడి చేసేందుకు ప్రయత్నించినప్పుడు తాను మెలకువతో ఉన్నానని.. అందుకే ఆమె నుంచి తప్పించుకున్నానని అందులో పేర్కొన్నాడు.
ఈ ఫిర్యాదును చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. అయితే జిల్లా మెజిస్ట్రేట్ కు కూడా meraz మొరపెట్టుకున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన కలెక్టర్ ముందు ఆశ్చర్యపోయి.. ఆ తర్వాత దీనిపై విచారణ చేపట్టాలని సబ్ డివిజనల్ పోలీస్ లను ఆదేశించారు. పోలీసులు దీనిని మానసిక వేధింపుల కోణం నుంచి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆమె నిజంగానే పాములాగా మారిపోతుందా? లేక భర్త నుంచి దూరంగా ఉండడానికి ఇలా నటిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఈ విషయం సోషల్ మీడియాలోకి వెళ్లడంతో.. చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు భర్తను దూరం చేసుకోవడానికి చాలామంది ఆడవాళ్లు ఇలా నటిస్తున్నారని.. ఈమె కూడా అలాగే ప్రవర్తిస్తుందని అంటుండగా.. మరికొందరు పూర్వ జన్మలో ఆమె పాముగా ఉండేదని.. ఇప్పుడు మనిషి జన్మ ఎత్తి మళ్లీ పాములాగా మారిపోయిందని వింతగా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా తనకు భార్య నుంచి ప్రాణహాని ఉందని భర్త చెప్పడంతో.. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.