Most expensive mushrooms: నేటి కాలంలో మనుషుల్లో ఆరోగ్య స్పృహ విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాదు తినే తిండి విషయంలో జాగ్రత్త కనిపిస్తోంది. అందువల్లే చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో శాకాహార వంటకాలలో మాంసం మాదిరిగా అనిపించే వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వాటిని అత్యంత రుచికరంగా వండుకొని తింటున్నారు. శాఖాహారంలో మాంసాహారం లాంటి వంటకాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనది పుట్టగొడుగు.
పుట్టగొడుగు ఒకప్పుడు శ్రీమంతులకు మాత్రమే వంటకం మాదిరిగా ఉండేది. నేటి కాలంలో ఆర్థిక స్థిరత్వం చాలామందికి పెరగడంతో పుట్టగొడుగులను ప్రధాన ఆహారంగా ఆరగిస్తున్నారు. పైగా ఇందులోను కొత్త కొత్త రకాలను శాస్త్రవేత్తలు ఆవిష్కరిస్తున్నారు. వాస్తవానికి కొన్ని రకాల పుట్టగొడుగులు అడవుల్లో లభిస్తాయి. అయితే వీటిని సేకరించడం అత్యంత కష్టంతో కూడుకున్న పని. అయితే కొంతమంది ఔత్సాహికులు అత్యంత శ్రమకు ఓర్చి అడవుల్లోకి వెళ్లి ఆ పుట్టగొడుగులను సేకరిస్తారు.. భారీ ధరకు విక్రయిస్తారు. వాటిల్లో మాంసకృతుల నుంచి మొదలుపెడితే పోషకాహాల వరకు మెండుగా ఉంటాయి కాబట్టి.. ఆహారంగా తీసుకుంటే శరీరానికి ఎంతో మంచిది.
కొన్ని రకాల పుట్టగొడుగులు సహజ సిద్ధంగా లభిస్తాయి. అటువంటి వాటిల్లో గుచ్చి ముందు వరుసలో ఉంటుంది. ఈ పుట్టగొడుగు రకాన్ని మోరల్ అని పిలుస్తుంటారు. ఇది జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కనిపిస్తుంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రాణాంతక వ్యాధుల నుంచి శరీరం రక్షించుకుంటుంది. ఔషధాలు తయారీలో కూడా వాడుతుంటారు. దేశీయంగా వీటి ధర 30,000 నుంచి 35 వేల మధ్యలో ఉంటుంది. విదేశాల్లో వీటి ధర 40,000 కి పైగా ఉంటుంది.
ఈ పుట్టగొడుగులను కొంతమంది ప్రత్యేకమైన షెడ్లు వేసి పెంచుతున్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది రైతులు ఈ పుట్టగొడుగు రకాలను తీసుకొచ్చి.. వాటి విత్తనాన్ని వృద్ధి చేస్తున్నారు. అనుకూల పరిస్థితులను కల్పించి పెంచుతున్నారు. ఈ పుట్టగొడుగులను స్థానికంగానే కాకుండా.. ఇతర ప్రాంతాలకు కూడా ఎగమతి చేస్తున్నారు. భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్ధిస్తున్నారు. ఇవే కాకుండా కొత్త రకాలను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు విశేషంగా కృషి చేస్తున్నారు. ఎందుకంటే పుట్టగొడుగుల్లో విపరీతంగా పోషకాలు ఉంటాయి. ఇందులో ఏ మాత్రం కూడా శరీరానికి హాని చేసే పదార్థాలు ఉండవు. పైగా వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.