Cryo Preservation: ఈ ప్రపంచంలో ఏదైనా కొత్త విషయం వెలుగులోకి వస్తే దాని గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. దాని ఆధారంగా అనేక రకాల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అవి కాస్త మరింత ఆసక్తిని కలగజేస్తాయి. ఇప్పుడు అటువంటి అంశమే ఒకటి విపరీతమైన ఆసక్తిని కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు కారణమవుతోంది.
ఒక మనిషి చనిపోతే ఆయా కుటుంబాల సాంప్రదాయాల ప్రకారం ఖననం లేదా దహనం చేస్తారు. కొందరైతే చనిపోయిన వ్యక్తి జ్ఞాపకాలను మరువలేక వారిని కొద్ది రోజులపాటు భౌతికంగా అలానే ఉంచి.. ఆ తర్వాత ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పుడు మీరు చదివే కథనం పూర్తి డిఫరెంట్. ఇది ఈజిప్ట్ మమ్మీని పోలి ఉంటుంది కానీ.. దానికి దీనికి చాలా డిఫరెంట్.
కొంతమంది చనిపోయిన తర్వాత.. వారి కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేరు. పైగా చనిపోయిన వ్యక్తులను ఖననం లేదా దహనం చేయడానికి ఒప్పుకోరు. ఇలాంటి వారి కోసం కొత్తగా క్రయో ప్రిరిజర్వేషన్ అనే విధానం వచ్చింది. దీని ప్రకారం ఒక శవాన్ని ఖననం చేయకుండా -196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ద్రవ నైట్రోజన్ లో నిలువ చేస్తారు. దీనివల్ల భవిష్యత్తు కాలంలో చనిపోయిన వ్యక్తిని బతికించే సాంకేతిక పరిజ్ఞానం గనుక అందుబాటులోకి వస్తే.. ఆ దేహాన్ని ఉపయోగించుకుంటారు. ఇందులో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. కన్నడకు నష్టం జరగకుండా ఉంటుంది. పైగా మృతుడి శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియలో రక్షక ద్రావణాలను ఉపయోగిస్తుంటారు.
ఇటీవల చైనాలో ఓ వ్యక్తి తన భార్యను కోల్పోయాడు. వాస్తవానికి ఆమె అంటే అతడికి చాలా ఇష్టం. కానీ ఊహించని విధంగా ఆమెకు క్యాన్సర్ సోకింది. ఎన్ని ఆస్పత్రులలో చూపించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఆమె చనిపోయింది. భార్యను ఖననం లేదా దహనం చేయడానికి ఇష్టం లేక ఆ వ్యక్తి క్రయో ప్రి రిజర్వేషన్ చేయించాడు. దాదాపు సంవత్సరాలపాటు తన భార్యను అలానే చూసుకున్నాడు. దీంతో అతని ప్రేమకు అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి ఒకరోజు అతడికి కూడా అనారోగ్యం సోకింది. తనను చూసుకోవడానికి ఒక మనిషి కావాలని అతడు భావించాడు. దీంతో అతడు మరో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత తన మొదటి భార్య మృతదేహాన్ని బయటకు తీసి ఖననం చేయించాడు. వాస్తవానికి ఇటువంటి విధానాలు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. భవిష్యత్తు కాలంలో చనిపోయిన మనిషిని కనుక బతికించే అవకాశం ఉంటే క్రయో ప్రి రిజర్వేషన్ విధానం కచ్చితంగా సంచలనం సృష్టిస్తుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.