Japanese longevity secrets: పాతికేళ్లకే మధుమేహం.. 30 సంవత్సరాలకే రక్తపోటు.. 40 ఏళ్లకు ఇతర అనారోగ్య సమస్యలు.. మొత్తంగా 50 సంవత్సరాలు నిండకుండానే జీవితాన్ని ముగించాల్సి వస్తోంది. రోగాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బతికినంత కాలం ఆస్పత్రుల చుట్టూ తిరగడం.. మందులు మింగడం.. సూదులు వేసుకోవడం.. పరీక్షలు చేయించుకోవడం.. ఇదిగో ఇలానే సాగిపోతోంది జీవితం. మన దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఇటీవల కాలంలో పెరిగిపోయింది.
ఒకప్పుడు సగటు జీవితకాలం 100 ఏళ్లకు పైగా ఉండేది. మన పూర్వికులు తమ జీవితాన్ని సెంచరీ మార్క్ కు చేర్చుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనారోగ్యాలు ఎక్కువైపోయాయి.. చిన్న వయసులోనే దీర్ఘకాలిక రోగాలు పెరిగిపోయాయి. దీనికి తోడు శారీరక శ్రమ లేకపోవడం.. అడ్డమైన తిండి తినడం పెరిగిపోయాయి. అందువల్లే వయసుతో సంబంధం లేకుండానే వ్యాధులు వస్తున్నాయి. ఒకప్పుడు శారీరక శ్రమ అధికంగా ఉండేది. అందువల్ల సీజనల్ వ్యాధులు తప్ప దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేవి కావు. ఇప్పుడు శారీరక శ్రమ లేకపోవడంతో సీజనల్ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా ముప్పేట దాడి చేస్తున్నాయి.
Also Read: అన్నం తినడం తగ్గించండి.. అప్పుడే నూరేళ్లు బతుకుతారు!
ఇలాంటి విపత్కర పరిస్థితిలో వందేళ్లు హాయిగా బ్రతకవచనం చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న జీవనశైలి వల్ల వంద సంవత్సరాలు బతకడం చాలా కష్టమే. ఆసియా ఖండంలోని జపాన్ ప్రజలు దీనిని సాధ్యం చేసి చూపిస్తున్నారు. వారి అలవాట్లను మనం గనక పాటిస్తే 100 సంవత్సరాలు హాయిగా బతకవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజు వ్యాయామం చేయాలి. సానుకూల ఆలోచనలను కలిగి ఉండాలి. తాజా కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. చేపలను తినాలి. సోయాను కూడా ప్రధాన వంటకంగా వండుకోవాలి. తక్కువ పరిమాణంలో భోజనం చేయాలి. రోజు నడకను కచ్చితంగా అలవాటు చేసుకోవాలి. తోట పనులు కూడా చేపట్టాలి. ఈ అలవాట్లు సగటు జీవిత కాలాన్ని పెంచుతాయని.. సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.