Puma
Puma: విశాలమైన దేహం, అంతకంటే విస్తారమైన జూలు, చురుకైన చూపు, అందమైన రూపు, వేటాడిందంటే అడవి వణికి పోతుంది. ప్రత్యర్థి జంతువు ఆ పంజా దెబ్బకు వెంటనే చచ్చిపోతుంది.. సింహం పేరు స్ఫురణ కు వస్తే పై విషయాలే గుర్తుకు వస్తాయి. కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ సింహం పిల్లి లాగా మారింది.. అచ్చం దానిలాగే అరుస్తోంది.. సింహం పిల్లి లాగా మారడం ఏంటి? అలా అరవడం ఏంటి? అనే సందేహాలు మీలో వ్యక్తమయ్యాయి కదా.. అయితే ఈ కథనం చదివేయండి.. మీ సందేహాలన్నీ నివృతి అవుతాయి.
సోషల్ మీడియాలో nature is amazing అనే ఐడి నుంచి ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. దట్టమైన అడవిలో ఓ భారీ పిల్లి లాంటి జంతువు పడుకొని ఉంది. వేట ముగించింది అనుకుంటా.. కడుపునిండా తిన్నదనుకుంటా.. భుక్తాయాసంతో బాధపడుతోంది. పైగా తిన్నది జీర్ణమయ్యేందుకు పడుకొని అటూ ఇటూ తిరుగుతోంది. దాంతోపాటు కేకలు కూడా పెడుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న జంతువును చాలామంది పిల్లి అనుకుంటున్నారు. కానీ అది పిల్లి కాదట.. సింహం జాతిలో ఒక రకానికి చెందిన ప్యూమా అట.
ప్యూమా చూసేందుకు పిల్లి లాగే ఉంటుంది. కాకపోతే ఇది సింహం జాతికి చెందింది. దీనిని జంతు పరిభాషలో పర్వత సింహం అని పిలుస్తారు. ఇవి భూమధ్యరేఖకు సమీపంలో నివసిస్తాయి. ఉత్తర ప్రాంతంలో నివసించే ప్యూమాల కంటే.. దక్షిణ ప్రాంతంలో నివసించే ఫ్యూమాలు చిన్నవిగా ఉంటాయి. ఉత్తర అమెరికాలో నివసించే ప్యూమాల సగటు బరువు 62 కిలోలు. కానీ అరుదుగా 100 కిలోల వరకు ఇవి పెరుగుతాయి. ప్యూమాలు 2.5 అడుగులు వరకు పొడవు పెరుగుతాయి. అయితే ఆడ ప్యూమాలు కాస్త పొట్టిగా ఉంటాయి.
ప్యూమాలు ఫెలిడే కుటుంబానికి చెందినవి. ఇవి ఆగ్నేయ ఆలస్కా నుంచి దక్షిణ అర్జెంటీనా, చిలి వరకు విస్తరించి ఉన్నాయి. ఎడారి ప్రాంతాలు, చిత్తడి నేలలు, పర్వతప్రాంత అడవులలో ఇవి ఎక్కువగా నివసిస్తాయి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఇవి విభిన్న రంగుల్లో కనిపిస్తాయి. పర్వతప్రాంతాలలో ఎర్రటి గోధుమ రంగు, ఎడారి ప్రాంతాలలో కాస్త నలుపు రంగుతో కనిపిస్తాయి.. ఇవి తక్కువ ఎత్తు ఉంటాయి కాబట్టి, భూమికి అత్యంత దగ్గరగా నడుస్తుంటాయి. ప్యూమాలు సాయంత్రం వేళ, రాత్రి సమయాలలో చురుకుగా ఉంటాయి. ఆ సమయంలో విపరీతంగా వేటాడుతాయి. కుందేళ్లు, కోయట్, బాబ్ క్యాట్, పోర్క్ ఫైన్స్, బీవర్ లు, ఒసో సమ్స్, రకూన్ లు, ఉడుములను వేటాడి తింటాయి. గొర్రెలు, పశువులు, మేకలు, చిన్న దూడలను కూడా వేటాడు తింటాయి. తాము చంపని జంతువు కళేబరం కనిపించినప్పటికీ.. ప్యూమాలు ముట్టను గాక ముట్టవు.. ఇది వేటాడేటప్పుడు రాత్రి సమయంలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. వేటాడే సమయంలో 1.2 గంటలపాటు ప్రత్యర్థి జంతువుతో ప్యూమా కలబడుతుంది..
ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. అమెరికాలోని అటవీ ప్రాంతంలో ప్యూమా కనిపించడంతో.. nature is amazing అనే ఐడీలో పోస్ట్ చేసిన వీడియోలు ప్యూమా సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియో లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది.. చాలామంది అందులో ఉన్న దానిని చూసి పిల్లి అనుకుంటున్నారు. కానీ అది సింహం.. ప్రత్యేకమైన సింహం అని చెబుతున్నారు జంతు శాస్త్ర నిపుణులు.
This is how a Puma sounds pic.twitter.com/k5B0Q7QLPs
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) June 1, 2024