Bengaluru techie couple: నేటి కాలంలో డబ్బు సంపాదించడం కొంతమందికి ఈజీగాను.. మరి కొంతమందికి కష్టంగానూ మారిపోయింది. డబ్బు సంపాదించేవారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. డబ్బు సంపాదించే స్తోమత లేని వారు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అందువల్లే మనదేశంలో ఆర్థిక తారతమ్యాలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. డబ్బు సంపాదించే వ్యక్తి తన స్థాయిని మరింత పెంచుకుంటుండగా.. డబ్బు సంపాదించలేని వ్యక్తి మరింత దిగజారి పోతున్నాడు. అయితే బెంగళూరుకు చెందిన ఓ జంట పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. వారి దగ్గర భారీగానే డబ్బుంది. ప్రతినెల వేతనాల రూపంలో వారిద్దరికీ భారీగానే వస్తుంది. కాని చివరికి అనుకోని కష్టం వారిద్దరికీ తీవ్రమైన తలపోటుని తెచ్చింది.
బెంగళూరుకు చెందిన ఓ జంట ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ భారీగానే వేతనాలు వస్తుంటాయి. ప్రతినెల 7 లక్షల వరకు సంపాదిస్తుంటారు. వారిద్దరికీ ఇంకా పిల్లలు పుట్టలేదు. కొంత కాలం వరకు పిల్లలను కనడాన్ని వాయిదా వేయాలని అనుకుంటున్నారు. అయితే వారికి వస్తున్న ఏడు లక్షల వేతనంలో ప్రతినెల 4 లక్షల వరకు ఖర్చు అవుతున్నాయి. ఇందులో సేవింగ్స్ నుంచి మొదలు పెడితే ఇంటి ఖర్చు వరకు అన్నీ ఉంటున్నాయి. ఇంత ఖర్చు పెట్టినప్పటికీ ప్రతినెలా వారికి ఇంకా మూడు లక్షలు మిగిలిపోతూనే ఉన్నాయి. అయితే ఆ డబ్బులను ఏం చేయాలో వీరిద్దరికీ తెలియడం లేదు. అందువల్లే ఇద్దరు కూడా తీవ్ర మదనంలో పడ్డారు. గ్రేప్ వైన్ అనే యాప్ లో వారిద్దరూ ఒక పోస్ట్ చేశారు. అది కాస్త ఇప్పుడు సంచలనంగా మారింది.
“మేము ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాం. మా ఇద్దరికీ ప్రతినెల 7 లక్షల వరకు వేతనాలు వస్తుంటాయి. ఇంత డబ్బును మేము జాగ్రత్తగానే ఖర్చు పెట్టుకుంటాం. అయినప్పటికీ ప్రతినెల 3 లక్షల వరకు మిగిలిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మాకు ఇంకా పిల్లలు కలగలేదు. కొంతకాలం వరకు పిల్లల్ని కనడాన్ని వాయిదా వేద్దామని అనుకుంటున్నాం. మిగిలిన ఈ నాలుగు లక్షల ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీకు ఏమైనా ఆర్థికపరమైన అంశాల మీద అవగాహన ఉంటే మాకు సలహాలు ఇవ్వండి అంటూ” ఆ దంపతులు పోస్ట్ చేశారు. దీంతో కొంతమంది ఆ డబ్బులను తమకు ఇవ్వాలని కోరగా.. ఇంకా కొంతమంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఇంకొందరేమో ఐటీ అనేది శాశ్వతం కాదని.. సాధ్యమైనంత వరకు సేవింగ్స్ స్కీం లలో పెట్టుబడి పెట్టండి అని మరి కొంతమంది సూచించారు. ఇంకొందరైతే బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. గోల్డ్ ఈక్విటీ స్కీములలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. కొందరైతే మాకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటే.. మీరేమో డబ్బులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.
బెంగళూరు నగరంలో జీవనశైలి అత్యంత ఖరీదుగా ఉంటుంది. మనదేశంలో అత్యంత ఖరీదైన జీవనశైలి నగరం ఉన్న ప్రాంతంగా బెంగళూరు కొనసాగుతోంది. అటువంటి నగరంలో ఈ దంపతులు ప్రతినెల 3 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారంటే మామూలు విషయం కాదు. అయినప్పటికీ 4 లక్షలు మిగులుతున్నాయంటే ఇది ఆశ్చర్యకరమైన విషయమని నెటిజన్లు పేర్కొంటున్నారు.