helmet : రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ వాడకం తప్పనిసరి. ద్విచక్ర వాహన వినియోగదారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. హెల్మెట్ వాడకంపై ట్రాఫిక్ పోలీసులు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ హెల్మెట్ ధరించిన భారీగా ఫైన్ విధిస్తున్నారు. అయినా చాలామంది హెల్మెట్ లేకుండా అని వాహనాలపై వెళ్తున్నారు. అయితే హెల్మెట్ వాడాల్సిన అవసరం ఉండి వాడని వారు కొందరైతే.. హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేని వారు కొందరు ఉన్నారు. వీరికి హెల్మెట్ వాడకం నుంచి పూర్తి మినహాయింపు ఉంది. మరి వాళ్ళు ఎవరో తెలుసుకుందామా..?
దేశవ్యాప్తంగా హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు హెల్మెట్ ధరించని వారురోడ్డు ప్రమాదాలతో మరణించిన సంఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో ముందుగా తలభాగం దెబ్బతింటుంది అందువల్ల హెల్మెట్ వాడడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాణాలు దక్కుతాయి. దీంతో హెల్మెట్ తప్పనిసరి అని కొన్ని రాష్ట్రాల్లో నిబంధనలు ఉన్నాయి. ద్విచక్ర వాహనం నడిపేవారు మాత్రమే కాకుండా వెనకాల కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాలని నిబంధన కూడా ఉంది. అయితే చాలామంది వీటిని పట్టించుకోవడం లేదు.
అయితే కొందరికి మాత్రం హెల్మెట్ వాడకపోయినా జరిమానా విధించరు. వీరిలో చిన్న పిల్లలు వస్తారు. నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు హెల్మెట్ వాడకపోయిన జరిమానా విధించరు. వీరు హెల్మెట్ బరువును మోయలేరు. అందుకే వీరికి హెల్మెట్ వాడకం నుంచి మినహాయింపు ఉంది. వీరితోపాటు సిక్కులకు కూడా హెల్మెట్ ధరించకపోయినా జరిమానా విధించరు. సిగ్గు లకు తలపాగా ఉంటుంది కాబట్టి హెల్మెట్ ధరించే అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి హెల్మెట్ జరిమానా నుంచి మినహాయింపు ఉంది. అయితే ఇది అన్ని రాష్ట్రాల్లో అమల్లో లేదు.
మిగతావారు మాత్రం హెల్మెట్ తప్పనిసరిగా వాడాలనే నిబంధన ఉంది. హెల్మెట్ వాడకపోవడం వలన వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబం జీవితం కూడా చిన్నాభిన్నం అవుతోంది. ఇంటి పెద్దగా ఉండే వ్యక్తి విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే చాలామంది హెల్మెట్ వాడకపోవడం వలన ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు హెల్మెట్ వాడడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.
అయితే పోలీసులు సైతం హెల్మెట్ వాడకంపై చర్యలు తీసుకుంటున్నారు. హెల్మెట్ వాడకపోయినా వారికి రూ. 5000 జరిమానా విధిస్తున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధనలు పట్టించుకోవడం లేదు. అయితే వీటిపై మరింత చర్యలు తీసుకోవాలని అందరూ అంటున్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు హెల్మెట్ మాత్రమే కాకుండా కళ్ళజోడు కర్చీ కట్టుకోవడం చాలా అవసరం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురికాకుండా ఉండగలుగుతారు. ఇక హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల నుంచి రక్షణ పొందడమే కాకుండా ఎండాకాలంలో వేడి నుంచి కూడా ఉపశమనం పొందుతారు. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో హెల్మెట్ వాడడం వల్ల ఉపశమనం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది.