National Parks : పచ్చని చెట్లు.. అందమైన జంతువులు.. అడుగడుగునా సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ప్రకృతి.. ఇలా చెప్పుకుంటూ పోతే అడవుల గురించి వర్ణన ఒక పట్టాన అందదు. అలాంటి అడవులు ఈ భూమ్మీద చాలా ఉన్నాయి. రమణీయ ప్రాంతాలు విస్తారంగా విస్తరించి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి.. ఇంకా సెలవులు ముగియలేదు కాబట్టి.. పిల్లలతో కలిసి సరదాగా వీటిని చుట్టేసి రండి. ఇంతకీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
క్రూగర్ నేషనల్ పార్క్, దక్షిణాఫ్రికా
దట్టమైన అడవులకు పేరు పొందిన ప్రాంతం ఆఫ్రికా. ఈ ఆఫ్రికాలో దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఉన్నది ఈ అడవి. జిరాఫీలు, ఏనుగులు, పులులు, సింహాలకు ఇది ఆలవాలం.
గాలా పాగోస్ దీవులు, ఈక్వెడార్
ప్రకృతి రమణీయతకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. విశాలమైన బీచ్.. దూసుకొచ్చే సముద్ర జలాలు.. చూసేందుకు ఆ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ అనేక రకాల సముద్ర జంతువులు కనిపిస్తాయి. ముఖ్యంగా గోలియత్ తాబేళ్లు ప్రధాన ఆకర్షణ.
సెరేంగేటి నేషనల్ పార్క్
ఆఫ్రికాలోని టాంజానియా ప్రాంతంలో ఉంటుంది ఈ అడవి. సింహాలు, పులులు, జిరాఫీలు, ఇతర జంతువులకు ఈ ప్రాంతం నిలయం.. ఇక్కడ సఫారీ పర్యాటకులను సమ్మోహితులను చేస్తుంది.
ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్
ఇది అమెరికాలో ఉంది. ఈ అడవిలో రాళ్లు పసుపు రంగును కలిగి ఉంటాయి. పైగా అవి సూర్యరశ్మి పడినప్పుడు మెరుస్తుంటాయి. ఈ అడవిలో తోడేళ్లు, దున్నపోతులు, గేదెలు, ఎలుగుబంట్లు విస్తారంగా ఉంటాయి.
బోర్నీయో
మలేషియా ప్రాంతంలో ఈ అడవి ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న కోతులు, ఒరంగుటాన్ లు, చింపాంజీలు, మరగుజ్జు ఏనుగులు కనిపిస్తాయి.. ప్రోబోస్సిస్ కోతులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.
గ్రేట్ బారియర్ రిఫ్
ఇది ఆస్ట్రేలియాలో ఒక పగడపు దిబ్బ. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. 3,44,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని వైశాల్యం 2,300 కిలోమీటర్లు. 2,900 దిబ్బలు, 900 ద్వీపాలు ఈ ప్రాంతంలో ఉంటాయి. సముద్ర జంతువులను ఇక్కడ అత్యంత దగ్గరి నుంచి చూడవచ్చు.
రణ తంబోర్ నేషనల్ పార్క్
ఇది రాజస్థాన్ ప్రాంతంలో విస్తరించి ఉన్న అతిపెద్ద ఉద్యానవనం. వివిధ రకాలైన పులులు, ఇతర క్రూర మృగాలకు ఈ ప్రాంతం ఆలవాలం. ఈ అడవిలో వైల్డ్ సఫారీ సరికొత్త అనుభూతినిస్తుంది.