Kundanbagh Haunted House: మనం దారి వెంబడి వెళ్తుంటే కొన్ని పురాతన భవనాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని చాలామంది పట్టించుకోరు. కానీ కొన్ని మాత్రం సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోతాయి. వీటిని కూల్చివేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం గాని.. లేదా వాటి గురించి పట్టించుకోవడానికి కొందరు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే పురాతన భవనం అనగానే అందులో ఏదో ఉంటుందని అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఒక పురాతన భవనం ఉంది. ఈ భవనం చుట్టుపక్కల ఉన్నవారు చెప్పేది ఏంటంటే.. రాత్రి సమయంలో ఏదో గజ్జల సౌండ్ వినిపిస్తుందని.. ఇద్దరు అమ్మాయిలు నడిచినట్లు అనిపిస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ బంగ్లా మిస్టరీ ఏంటి? చుట్టుపక్కల వారు చెప్పేది నిజమేనా?
హైదరాబాదులోని కుందన్ భాగ్ ఏరియా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ఇళ్ల గురించి అందరికీ తెలియకపోవచ్చు. ప్రస్తుతం పురాతన భవనంలో కనిపిస్తున్న ఈ భవనాన్ని 2002 లో వర్షిత్ నారాయణ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే ఈయన చుట్టుపక్కల వారితో ఎక్కువగా కమ్యూనికేషన్ ఉండే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడూ లోన్లీగా కనిపించేవాడని చుట్టుపక్కల వారు చెప్పారు. అయితే అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు అమెరికాలో ఉండేవాడు. ఒకరోజు అనుకోకుండా వర్షిత్ నారాయణ మరణించాడు. దీంతో అతని కుమారుడికి ఈ విషయం తెలియగానే ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు అన్ని పూర్తి చేసిన తర్వాత.. ఆ బంగ్లాను ఒక ఫ్యామిలీకి అద్దెకు ఇచ్చాడు. ఆ ఫ్యామిలీ లో భార్యాభర్తలతో పాటు ముగ్గురు అమ్మాయిలు ఉండేవారు. అయితే వీళ్ళు కూడా ఇతరులతో ఎక్కువగా కమ్యూనికేషన్ చేసేవారు కాదు.
అయితే ఒక రోజు ఈ భవనంలో దొంగతనానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి భవనంలోకి రాగానే ముగ్గురూ అమ్మాయిలా మృతదేహాలు వరుసగా పడి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన ఆ వ్యక్తి వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి చెప్పాడు. పోలీసులు ముందుగా అతడిని అరెస్టు చేసి.. ఆ తర్వాత ఇంటరాగేషన్ కోసం భవనం వద్దకు వచ్చారు. అయితే ఆ భవనంలోని మృతదేహాలను చూస్తే ఆరు నెలల కింద మరణించినట్లు కనుగొన్నారు. అసలు ఏం జరిగింది అని పోలీసులు పోస్టుమార్టంకు పంపించి ఆరా తీయగా ఆ కుటుంబంలో కొన్ని కారణాలతో ఫినాయిల్ తాగి మరణించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆ తర్వాత మహమ్మద్ సజన్ అనే దొంగను విడిచిపెట్టారు.
అయితే ఈ భవనంలో రాత్రి సమయంలో ఇద్దరూ ఆడవాళ్లు తిరుగుతున్నట్లు.. గజ్జల సౌండ్ వస్తున్నట్లు చుట్టుపక్కల వారంతా అనుకోవడంతో.. అది కాస్త ఇంటర్నెట్ లేని కాలంలోనే వైరల్ గా మారిపోయింది. ఒకరి నుంచి మరొకరికి వెళ్లి కుందన్ బాగ్ మిస్టరీ బిల్డింగ్ అని చాలామంది స్టోరీస్ కూడా రాస్కొచ్చారు. మొత్తంగా చెప్పేది ఏందంటే ఈ భవనంలో ముగ్గురు ఆడవాళ్లు ఎందుకు చనిపోయారు అన్నది మిస్టరీగా ఉండిపోయింది. అలాగే రాత్రి సమయంలో నిజంగానే భవనం నుంచి శబ్దాలు వస్తున్నాయా? అని కొందరు ఇప్పటికీ ఆరా తీస్తున్నారు.