Pavel Durov : : అతడు ఎవరినీ ప్రేమించలేదు. ఇంకెవరితోనూ డేటింగ్ చేయలేదు. ఏ స్త్రీతోనూ అతడు పడకను పంచుకోలేదు. సుఖాన్ని పొందలేదు. అలాగని అతడేమీ అయోగ్యుడు కాదు. ఉద్యోగం సద్యోగం లేకుండా తిరిగే గాలి బ్యాచ్ అంతకన్నా కాదు. వందల కోట్ల వ్యాపారం.. ఫార్చ్యూన్ జాబితాలో అద్భుతమైన వ్యాపారవేత్తగా అతనికి పేరు ఉంది. దేశ విదేశాలలో అతనికి కార్యాలయాలు ఉన్నాయి. చిటిక వేస్తే చాలు రోల్స్ రాయిస్ లాంటి కార్లు క్యూలో ఉంటాయి. కనుసైగ చేస్తే చాలు బోయింగ్ కంపెనీ విమానాలు కళ్ళముందు ఉంటాయి. అయినప్పటికీ అతడు పెళ్లి చేసుకోలేదు. ప్రేమలోనూ పడలేదు. డే*** వంటిది కూడా చేయలేదు. అయినప్పటికీ 12 దేశాలలో అతడు ఖాతాలు తెరిచాడు. ఏకంగా 100 మందికి పైగా పిల్లల్ని కన్నాడు. కాకపోతే ఇక్కడే అసలైన ట్విస్ట్ చెప్పాడు. దీంతో నివ్వెర పోవడం నెటిజన్ల వంతవుతోంది.
ఇంతకీ ఎవరతనంటే..
పై ఉపోద్ఘాతం చదివిన తర్వాత.. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని మీకు కూడా ఆతృతగా ఉంది కదూ.. ఇంతకీ ఆ వ్యక్తి పేరు ఏంటంటే ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్. టెలిగ్రామ్ యాప్ ద్వారా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన పావెల్ .. మంగళవారం ఒక ప్రకటన చేసి అదే స్థాయిలో కలకలం రేపాడు. పావెల్ ఏకంగా 12 దేశాల్లో వందమందికి పైగా పిల్లలకు బయోలాజికల్ తండ్రిగా మారాడు. ఇదే విషయాన్ని అతడు తన టెలిగ్రామ్ ఛానల్లో సుదీర్ఘ పోస్టులో పేర్కొన్నాడు.” నాకు పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు. ఒంటరి జీవితాన్ని నేను ఇష్టపడతాను. అయినప్పటికీ నాకు వందమందికి పైగా సంతానం ఉన్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందని మీరు అనుకోవచ్చు. 15 సంవత్సరాల క్రితం నా స్నేహితుడు ఒకరు నన్ను కలిశాడు. అత్యంత అరుదైన కోరిక కోరాడు. నా మిత్రుడికి, అతడి భార్యకు సంతానం కలిగే అవకాశం లేదు. అతడికి సంతానం కోసం నన్ను వీర్య దానం చేయమన్నారు. అది విన్న నేను చాలా సేపు నవ్వుకున్నాను. అయితే ఆ నవ్వు చాలా తీవ్రమైందని.. ఆ సమస్య అంతకంటే తీవ్రమైందని నాకు తర్వాత తెలిసింది. సభ్య సమాజంలో చైతన్య శీలమైన వీర్యాన్ని దానం చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారని డాక్టర్ చెప్పారు. వృధాగా పోయే వీర్యాన్ని దానం చేసి సంతానం లేని దంపతులకు అందిస్తే అది సామాజిక బాధ్యత అవుతుందని ఆ డాక్టర్ నాకు గుర్తు చేశారు. ఆ తర్వాత నేను సె*** డొనేషన్ లో రిజిస్టర్ చేయించుకున్నాను. ఇప్పటివరకు 12 దేశాలలో వంద మందికి పైగా దంపతులకు సంతాన భాగ్యాన్ని అందించాను. చాలా సంవత్సరాల క్రితమే నేను వీర్య దానాన్ని నిలిపివేశాను. అయితే నేను అప్పట్లో ఇచ్చిన వీర్యాన్ని ఫ్రీజ్ చేశారు. దాని ద్వారా చాలామంది దంపతులకు సంతానం భాగ్యాన్ని కలిగిస్తున్నారని తెలుసుకున్నానని” పావెల్ అన్నాడు.
రిస్క్ ఉందని తెలుసు
అయితే చాలా సంవత్సరాల తర్వాత తాను వీర్య దానం చేసిన విషయాన్ని పావెల్ బయట పెట్టడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఈ విషయంలో కొంత రిస్క్ ఉన్నప్పటికీ.. వీర్య దాతగా తాను పశ్చాత్తాప పడడం లేదని పావెల్ పేర్కొన్నాడు.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా సంతానలేమి సమస్య తీవ్రంగా ఉందని, అలాంటి దంపతులకు పిల్లలను ఇచ్చి వారికి సంతోషాన్ని కలిగించినందుకు తనకు గర్వంగా ఉందని పావెల్ వివరించాడు. ఇదే సమయంలో చాలామంది వీర్యదానానికి ముందుకు రావాలని అతడు పిలుపునిచ్చాడు. దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అతని పేర్కొన్నాడు. పావెల్ టెలిగ్రామ్ ఛానల్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఆ పోస్టును 20 లక్షల మందికిపైగా వీక్షించారు. వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చాలామంది పావెల్ చేసిన పనిని సమర్థిస్తుండగా.. మరి కొంతమంది విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది విక్కీ డోనర్ అనే సినిమాను ప్రస్తావిస్తున్నారు. వీర్యదానం నేపథ్యంలో హిందీలో రూపొందించిన విక్కీ డోనర్ సినిమా బ్లాక్ బస్టర్ గా గెలిచింది. అత్యంత సున్నితమైన అంశాన్ని దర్శకుడు తెరకెక్కించిన విధానం నచ్చడంతో ప్రేక్షకులు ఆ సినిమాను విపరీతంగా ఆదరించారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Telegram founder ceo pavel durov pavel became the biological father of more than 100 children in 12 countries simultaneously
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com