Beat the heat tips summer: ఏప్రిల్ నెల వచ్చేసింది. ఎండలను కూడా దండిగా తెచ్చేసింది. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ.. మిగతా ప్రాంతాలలో మాత్రం సూర్యుడు రెచ్చిపోతున్నాడు. 30 దాటేసి 40 డిగ్రీల ఎండతో మంట పెడుతున్నాడు. నడి నెత్తిన కుంపటి మాదిరిగా సూర్యుడు భగభగ మండుతున్నాడు
ఎండాకాలంలో మనుషులకు మాత్రమే కాదు.. మనుషులు వాడే ద్విచక్ర వాహనాలకు కూడా ఇబ్బంది ఉంటుంది. మనుషులు ఎండకు తట్టుకోలేక నీడలో సేద తీరుతుంటారు. చల్లటి పానీయాలను తాగుతూ ఉంటారు. కొందరైతే ఎండను తట్టుకోలేక శీతల ప్రాంతాలకు వెళ్తుంటారు.. మనుషులైతే తమ బాధను
.. తమకి ఇబ్బందిని తీర్చుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. యంత్రాలు నీడని కోరుకోలేవు. ఎండ వల్ల ఇబ్బంది ఎదురవుతోందని చెప్పలేవు. అలాంటప్పుడు వాటి బాధను గుర్తించి.. అవి మొరాయించకుండా ఉండడానికి కొన్ని చిట్కాలను పాటించాలి.
గతంలో ఏవైనా ప్రాంతాలకు వెళ్లాలంటే సైకిళ్ళను వాడేవారు. ఆ తర్వాత యాంత్రికరణ పెరిగిపోయింది. ద్విచక్ర వాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను వాడటం పెరిగిపోయింది.. ద్విచక్ర వాహనాలకు ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించి.. ఆయిల్ మార్చి.. సక్రమంగా డ్రైవింగ్ చేస్తే ఇబ్బంది ఉండదు. అయితే కొన్ని సందర్భాలలో ద్విచక్ర వాహనాలు మోరాయిస్తుంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ద్విచక్ర వాహనాలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.. అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా.. స్మూత్ గా రోడ్డు మీద వెళ్లాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఎండాకాలంలో ద్విచక్ర వాహనాలను నీడలో పార్క్ చేయాలి. టైర్లలో గాలి ఎక్కువ లేదా తక్కువ కాకుండా చూసుకోవాలి. బ్రేక్ ఆయిల్.. ఇంజన్ ఆయిల్ వంటిల్లు సరిపడా ఉండాలి. ఎండాకాలంలో పెట్రోల్ ఆవిరి అవుతూ ఉంటుంది. వేడికి వ్యాకోచించి లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయించకపోవడం మంచిది. అగ్నిప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాలలో.. లేదా వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను పార్క్ చేయకుండా ఉండడమే మంచిది. సాధ్యమైనంతవరకు. నీడ ప్రాంతంలోనే ద్విచక్ర వాహనాలను పార్క్ చేయాలి. ఎప్పటికప్పుడు టైర్లలో గాలిని సరిచూసుకుంటూ ఉండాలి.
ముఖ్యంగా ఇంధనం నింపే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు డ్రైవింగ్ చేయకపోవడమే మంచిది.. ఏవైనా అత్యవసరమైన పనులు ఉంటే ఉదయం వేళలో లేదా సాయంత్రం వేళలో పూర్తి చేసుకునేలా ఉండాలి.