Homeవార్త విశ్లేషణStress relief without doctors: ఒత్తిడి సతమతం చేస్తోందా.. డాక్టర్లు అవసరం లేదు.. ఈ విధానమే...

Stress relief without doctors: ఒత్తిడి సతమతం చేస్తోందా.. డాక్టర్లు అవసరం లేదు.. ఈ విధానమే దివ్యౌషధం

Stress relief without doctors: ఒకప్పుడు శరీరానికి తగిన శ్రమ ఉండేది. అందువల్ల నిద్ర సులభంగానే పట్టేది. రోగాలు కూడా అంతగా ఉండేవి కాదు. తిండి కూడా ఇంట్లో వండుకొని తినేవారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు.. ఫలితంగా సగటు మనిషి ఆయుషు కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. బయట తినడం పెరిగిపోయింది. సంపాదన ఎక్కువైంది కాబట్టి ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంది. సాటి మనిషితో మాట్లాడటం పూర్తిగా తగ్గిపోయింది. ఫోన్లో మునిగిపోవడం తారాస్థాయిని కూడా దాటిపోయింది. స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం వల్ల చాలామందిలో రకరకాల వ్యాధులు వస్తున్నప్పటికీ.. ఎవరూ ఆ అలవాటును తగ్గించుకోలేకపోతున్నారు.

ఆధునిక జీవనశైలి వల్ల చాలామంది ఒత్తిడి అనుభవిస్తున్నారు. చదువు.. ఉద్యోగం.. కెరియర్.. ప్రేమ.. పెళ్లి.. పిల్లలు.. మంచి ఇల్లు.. విలాసవంతమైన కారు.. ప్లాట్లు.. బంగారం.. ఫిక్స్ డ్ డిపాజిట్లు.. పిల్లలు.. వాళ్ల చదువులు.. ఇంకా రకరకాల లక్ష్యాలతో చాలామంది వాటి చుట్టూ పరుగులు పెడుతున్నారు. ఉన్నతమైన జీవితాన్ని ఆస్వాదించడానికి తీవ్రమైన ఒత్తిడిలో కూరుకు పోతున్నారు.

ఒత్తిడి వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. మధుమేహం, రక్తపోటు, కొవ్వు నిల్వలు పేరుకుపోవడం.. అధిక బరువు.. ఇంకా రకరకాల సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం ఒత్తిడి. దీనిని తగ్గించుకోవడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వైద్యులను సంప్రదిస్తున్నారు. మందులు వాడుతున్నారు. ఇన్ని చేసినప్పటికీ ఒత్తిడి తగ్గడం లేదు.

ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి జపాన్ ప్రజలు షిన్రిన్ యోబు అనే విధానాన్ని పాటిస్తున్నారు. ఇది పూర్తిగా సహజమైన ప్రక్రియ. షిన్రిన్ యోకు అంటే ప్రకృతి ఒడిలో కలిసిపోవడం.. పచ్చని చెట్ల మధ్య.. పక్షుల కిల కిల రావాల మధ్య.. మట్టి వాసనలను ఆస్వాదిస్తూ గడపడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. ఇలా ప్రకృతిలో కలిసిపోతే మానసిక ఆందోళనలు దూరమైపోతాయి. శారీరకంగా ప్రశాంత లభిస్తుంది. మానసికంగా ఒత్తిడి దూరమవుతుంది. అందువల్లే జపాన్ ప్రజలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

అయితే ఈ కథనం వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఎందుకంటే మనిషి జీవనశైలి ఆధారంగా ఒత్తిడి అనేది ఉంటుంది. ఆ ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని విధానాలు అనుకూలంగా ఉంటాయి. అయితే అవి వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కావు. ఇక ఈ సమాచారాన్ని వివిధ వేదికల వద్ద సేకరించి.. ఓకే తెలుగు పాఠకుల కోసం అందించాం. ఎట్టి పరిస్థితిలో ఈ కథనం వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని పాఠకులు గుర్తుంచుకోవాలి.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version