Stag Beetle: ఆ పురుగు దొరికితే మీరు లక్షాధికారే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కీటకం అదే!

ప్రపంచంలో ఖరీదైన కీటకాల్లో స్టార్‌ బీటిల్‌ ఒకటి. ఒక స్టాగ్‌ బీటిల్‌ విలువ ఏకంగా రూ.75 లక్షలు. కీటకానికి ఇంత ఖరీదు ఎందుకంటే.. ఈ స్టాగ్‌ బీటిల్‌ను అదృష్ట చిహ్నంగా భావిస్తారు. ఈ కీటకం ఇంట్లో ఉంటే ఒక్క రోజులోనే లక్షాధికారి అవుతామని నమ్ముతారు.

Written By: Raj Shekar, Updated On : July 8, 2024 9:18 am

Stag Beetle

Follow us on

Stag Beetle: మనకు ప్రకృతిలో అనేక జీవరాశులు, జంతువులు, జలచరాలు, క్రిమి కీటకాలు కనిపిస్తాయి. అయితే వాటి గురించి పెద్దగా పట్టించుకోం. ఇక క్రిమి కీటకాలకు అయితే దూరంగా ఉంటాం. మన దగ్గరకు వచ్చినా చంపేస్తాం. ఎందుకంటే వాటిలో వ్యాధులు సోకుతాయని భయపడతాం. కానీ, కొన్ని కీటకాలు చాలా విలువైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనకు మేలు చేయడమే కాకుండా మనల్ని లక్షాధికారిని చేస్తాయని పేర్కొంటున్నారు. ఇప్పుడు అలాంటి కీలకం గురించి వెల్లడించారు. దాని ధర వింటే నోరెల్లబెట్టాల్సిందే. ఆ ఖరీదైన కీటకం గురించి తెలుసుకుందాం.

స్టాగ్‌ బీటిల్‌…
ప్రపంచంలో ఖరీదైన కీటకాల్లో స్టార్‌ బీటిల్‌ ఒకటి. ఒక స్టాగ్‌ బీటిల్‌ విలువ ఏకంగా రూ.75 లక్షలు. కీటకానికి ఇంత ఖరీదు ఎందుకంటే.. ఈ స్టాగ్‌ బీటిల్‌ను అదృష్ట చిహ్నంగా భావిస్తారు. ఈ కీటకం ఇంట్లో ఉంటే ఒక్క రోజులోనే లక్షాధికారి అవుతామని నమ్ముతారు. ఇక ఈ స్టాగ్‌ బీటిల్‌ చెక్కలపై ఆధారపడి జీవిస్తుంది. జీవ వైవిధ్యంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

లండన్‌ మ్యూజియం ప్రకారం..
లండన్‌లోని నేచురల్‌ హిస్టరీ మ్యూజియం ఈ స్టాగ్‌ బీటిల్‌ గురించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది. ఈ స్టాగ్‌ బీటిల్‌ 2 నుంచి 6 గ్రాముల బరువు ఉంటుంది. దీని సగటు జీవితకాలం 3 నుంచి 7 ఏళ్లు. మగ స్టాగ్‌ బీటిల్‌ పొడవు 35 నుంచి 75 మి.మీ ఉంటుంది. ఆడ స్టాగ్‌ బీటిల్‌ పొడవు 30 నుంచి 50 మి.మీ పొడవు ఉంటంది. వీటిని ఔషధాల కోసం కూడా ఉపయోగిస్తారట.

ఎక్కడ ఉంటాయంటే..
ఈ ఖరీదైన స్టాగ్‌ బీటిల్స్‌ వెచ్చని, ఉష్ణమండల వాతావరణంలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. చల్లని వాతావరణం వీటికి పడదు. ఎక్కువగా అడవుల్లోనే జీవిస్తాయి. ముళ్లపొదలు, సంప్రదాయ తోటలు, పార్కులు, తోటలు వంటి పట్టణ ప్రాంతాల్లోనూ ఎక్కువగా కనిపిస్తాయి. ఎండిపోయిన వృక్షాల కలపలో స్టాగ్‌ బీటిల్స్‌ నివాసం ఏర్పాటు చేసుకుంటాయి.

వీటి ఆహారం ఏమిటో తెలుసా..
ఇక అడల్ట్‌ స్టాగ్‌ బీటిల్స్‌ చెట్ల సాప్‌ ద్రవాన్ని, కుళ్లిన పండ నుంచి వచ్చే రసాన్ని ఆహారంగా తీసుకుంటాయి. లార్వా దశలో ఇవి తీసుకునే ఆహారం నుంచి వచ్చే శక్తిపైనే ఎక్కువగా ఆధారపడతాయి. తొలి దశలో ఇవి తమ పదునైన దవడలతో కలపను చీల్చి తింటాయి. ఎండిన కలపనే ఇవి తింటాయి. పచ్చని మొక్కలు, చెట్లకు ఎలాంటి హాని చేయవు.