Homeవింతలు-విశేషాలుSrikakulam cloud fall viral video: శ్రీకాకుళంలో భూమి మీదకి రాలిన మేఘాలు.. అసలు నిజం...

Srikakulam cloud fall viral video: శ్రీకాకుళంలో భూమి మీదకి రాలిన మేఘాలు.. అసలు నిజం ఇదీ.. షాకింగ్ వీడియో

Srikakulam cloud fall viral video: సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజులు ఇవి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతున్న క్షణాల్లో తెలిసిపోతున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. రొటీన్ కు కాస్త భిన్నంగా ఉన్న ఈ సంఘటన అయినా సరే క్షణాల్లో వైరల్( viral) అవుతుంది. అయితే ఒక్కోసారి వదంతులు సైతం క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయి. ఆకాశం నుంచి తోక చుక్కలు, ఉల్కలు కింద పడటం చూసే ఉంటాం. ఇవి చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి ఎన్నో ఖగోళ వింతలు ఎక్కడో ఒకచోట నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయితే ఆకాశం నుంచి మేఘాలు కింద పడటం ఎప్పుడైనా చూశారా? అటువంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Also Read: Delhi pollution : ఢిల్లీలో కాలుష్యానికి చెక్ పెట్టేందుకు సరికొత్త ప్రయత్నం.. నవంబర్ నుంచి అమల్లోకి.. ఇంతకీ ఏం చేయబోతున్నారంటే

సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం..
పెద్ద ఎత్తున మేఘాలు భూమ్మీద పడుతున్నాయని సోషల్ మీడియాలో( social media) ప్రచారం జరుగుతోంది. చాలామంది ఆ వీడియోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తున్నారు. ఆకాశం నుంచి మేఘం రూపాన్ని పోలినవి భూమ్మీద పడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రజలు వీటిని ఆశ్చర్యంగా చూస్తూ తమ స్పాట్ ఫోన్లో రికార్డు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఇవి మేఘాలు కావు. నిజానికి మేఘం కింద పడడం అనేది అసాధ్యం. అయినా మేఘాలు అంత తక్కువ పరిమాణంలో ఉండవు. చాలా పెద్దగా ఉంటాయి. ఈ వీడియోలో కనిపిస్తోంది కేవలం ఒక నురుగు మాత్రమే.

Also Read: Cloud Burst : ఆకాశానికి చిల్లు పడుతోందా? ప్రపంచానికి ఈ కొత్త ఉపద్రవం ఏంటి? కారణమేంటి?

పరిశ్రమల నుంచి సహజం..
సాధారణంగా పరిశ్రమల( industries) నుంచి ఇలాంటి నురుగు వస్తుంది. పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు నీటితో కలవడం వల్ల ఇలాంటి నురుగు సహజంగానే ఏర్పడుతుంది. ప్రస్తుతం వర్షాలు పడుతుండడం, గాలులు వీస్తుండడంతో ఈ నురగ ఇలా గాల్లోకి తేలినట్లు స్పష్టమవుతుంది. గతంలో కూడా పట్టణాలు, నగరాల్లో ఇలాంటి నురుగ వెలుగు చూసిన సందర్భాలు అనేకం. ఇది కూడా అటువంటి జాబితాలోకి వస్తుంది. కాబట్టి మేఘాలు కింద పడుతున్నాయన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. అది అసాధ్యం కూడా అని తేల్చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version