Saudi Arabia: సౌదీ అరేబియా.. ఈ పేరు వినగానే ఎడారి గుర్తొస్తుంది. భారతీయులు, ముఖ్యంగా తెలంగాణకు చెందిన వారు ఎక్కువగా వలస వెళ్లేది ఇక్కడికే. ఈ దేశంలో ఎటు చూసినా ఇసుక దిబ్బలే కనిపిస్తాయి. పర్యాటకులు ఇసుక దిబ్బలను సందర్శిస్తుంటారు. అయితే కొన్నేళ్లలో సౌదీలో ఇసుక దిబ్బలు కనిపించకపోవచ్చు. ఎడారిగా పేరుగాంచిన సౌదీ అరేబియాలో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇక్కడి ఎడారి కొండల్లో ఇసుక మాయమై పచ్చదనం అలుముకుంటోంది. . ఒకప్పుడు ఇసుకతో నిండిన ప్రాంతాలు ఇప్పుడు ఆకుపచ్చ రంగు అద్దుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
వీడియోలో ఇలా…
ఈ వీడియోలో సౌదీ ఎడారి కొండ ప్రాంతాలలో ఇసుక దిబ్బలకు బదులుగా ఆశ్చర్యకరమైన పచ్చదనంతో పచ్చిక బయళ్లు కనిపిస్తున్నాయి. ఈ పచ్చిక బయళ్లలో ఒంటెలు సంతోషంగా గడ్డి మేస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక దిబ్బలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. సౌదీలో వర్షాలు కురవడం, పచ్చదనం పెరగడం ప్రత్యేమైన విషయంగా పేర్కొంటున్నారు.
సైంటిస్టులు షాక్..
ఇక ఈ వీడియో చూసిన శాస్త్రవేత్తలు కూడా షాక్ అవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ క్లిప్ చూస్తున్న చాలా మంది ఎడారి దేశం సౌదీ అరేబియా అంటే నమ్మడం లేదు. ఒంటెను ఎక్కడికో తీసుకెళ్లి వీడియో తీశారని పేర్కొంటున్నారు. అయితే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో మిలియనీరెస్ స్టెప్స్ అనే అకౌంట్ నుంచి పోస్టు చేశారు. ఈ వీడియోను ఇప్పటికే సుమారు 30 వేల మంది వీక్షించారు. కామెంట్లు కూడా పెడుతున్నారు.
కామెంట్లు ఇలా..
ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ ఇలా అంటున్నారు.. ‘ఇది ప్రపంచం అంతం కావడానికి సంకేతం’ అని పేర్కొన్నాడు. ఎడారిలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోందని కొందరు పేర్కొంటున్నారు. ఈ వీడియో ఈ ఏడాది జనవరిలో తీసిందని నిపుణులు చెబుతున్నారు. సౌదీలో వాతావరణంలో మార్పు కారణంగా అధిక వర్షం, ఆకస్మిక వరదలు సంభవించాయని దాని కారణంగానే పచ్చదనం సంతరించుకుని ఉంటుందని పేర్కొంటున్నారు.