Homeవింతలు-విశేషాలుMoscow Unusual Clouds: వామ్మో చూస్తుండగానే ఆకాశం అలా మారిపోయింది... మానవాళికి ముప్పు తప్పదా?

Moscow Unusual Clouds: వామ్మో చూస్తుండగానే ఆకాశం అలా మారిపోయింది… మానవాళికి ముప్పు తప్పదా?

Moscow Unusual Clouds: గత కొన్ని సంవత్సరాలుగా మానవాళి అనేక ముప్పులను ఎదుర్కొంటున్నది.. ఈ ముప్పులను ఎదుర్కొనే క్రమంలో భారీగా నష్టపోతున్నది. ప్రకృతి విపత్తులు, మహమ్మారులు వంటితో చేసే పోరాటంలో మనుషులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆస్తిపరంగా, ప్రాణాలపరంగా భారీగానే కోల్పోతున్నారు.. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కరోనా విలయం సృష్టించింది. దాని నుంచి ప్రపంచం కొద్దికొద్దిగా తేరుకుంటున్న క్రమంలో వరదలు, కరువు కాటకాలు, హిమ పాతం వంటివి మనుషులకు నరకం అంటే ఏంటో చూపిస్తున్నాయి. చూస్తుండగానే కాళ్ళ కింద భూమి కంపించిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో విపత్తు పొంచి ఉందా? ఆకాశం అందుకు సంకేతాలు ఇస్తోందా? రష్యా రాజధాని మాస్కోలో ఏర్పడిన పరిణామాలు అందుకు నిదర్శనమా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరి మదిని తొలుస్తున్నాయి.

Also Read: ఏపీకి మరో కొత్త ఎయిర్ పోర్ట్.. ఆ జిల్లాకు మహర్దశ!

రష్యా రాజధాని మాస్కోలో ఆకాశం ఒక్క సారిగా మారిపోయింది. ఆకాశంలో బెలూన్ల వంటి ఆకారాలు ఏర్పడ్డాయి. ఆకాశంలో అనుహ్యమైన మార్పులు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. వర్షాలు కురుస్తున్నప్పుడు.. వేడి గాలులు వీస్తున్నప్పుడు.. హిమపాతం కురుస్తున్నప్పుడు మార్పులు ఏర్పడుతుంటాయి. ఈ మార్పులు ఏర్పడినప్పుడు ఏదో ఒక తీరుగా భూమ్మీద వాటి ప్రభావం పడుతూనే ఉంటుంది. అందువల్లే సాధ్యమైనంతవరకు ఇటువంటి మార్పులు చోటు చేసుకున్నప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. తాజాగా రష్యాలో ఆకాశంలో చోటుచేసుకున్న మార్పులు అందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.. దీంతో అక్కడి వాతావరణ శాఖ స్పందించింది. వేడి గాలులు వీచే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇలా ఏర్పడుతుంటాయని.. కానీ ప్రస్తుతం దేశంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని.. వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అందువల్లే ఆకాశం ఇలా మారిపోయిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాతావరణ శాఖ అధికారులు చెప్పిన తర్వాత రష్యాలో పలు ప్రాంతాలలో పిడుగుపాటు సంభవించడం విశేషం.. అయితే వీటి వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు.. ఏ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది అనే విషయాలను మాత్రం దశ బయటికి వెల్లడించడం లేదు.

ఉక్రెయిన్ తో యుద్ధం వల్ల రష్యా భారీగా యుద్దసామాగ్రిని వాడింది. తమ భూభాగం నుంచి కాల్పులకు పాల్పడింది. యుద్ధం వల్ల రష్యాలో కాలుష్యం విపరీతంగా చోటు చేసుకున్నది. అందువల్లే కొన్ని ప్రాంతాలలో వేడి వాతావరణం నెలకొన్నది. రష్యా యూరప్ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో అంతగా ఉష్ణోగ్రత నమోదు కాదు. కానీ గడిచిన రెండు సంవత్సరాలుగా ఇక్కడ వాతావరణం చాలా మారిపోయింది. ఉష్ణోగ్రత అంచనాలకు అందనిస్థాయిలో పెరిగిపోయింది. వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వీటిని మర్చిపోకముందే ఆకాశంలో ఏర్పడుతున్న మార్పులు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

వర్షం వస్తున్నప్పుడు ఆకాశంలో ఎర్రటి మేఘాలు కనిపిస్తుంటాయి. వేడి గాలులు వీస్తున్నప్పుడు ఆకాశంలో ఒక రకమైన ఆకారంలో మేఘాలు ఏర్పడుతుంటాయి. ఎప్పుడు కూడా బెలూన్ల మాదిరిగా ఆకాశంలో మేఘాలు ఏర్పడవు. చూసేందుకు అవి భయంకరంగా ఉండవు. కానీ ప్రస్తుతం రష్యాలో ఏర్పడిన మేఘాలు భీకరంగా ఉన్నాయి.. రాబోయే ప్రమాదానికి హేతువులుగా అవి కనిపిస్తున్నాయి. వీటి వల్ల ప్రమాదం ఉంటుందా? మానవాళికి ముప్పు పొంచి ఉంటుందా? అనే ప్రశ్నలకు శాస్త్రవేత్తలు కాదు అనే సమాధానం చెబుతున్నారు. ప్రకృతిలో ఇటువంటి మార్పులు సహజమేనని.. అయితే ఇవి ఇలా ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయని వారు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular