Godavari districts : ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన పులస చేప లభించేది ఇక్కడే. పులస చేపకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పులస చేప కోసం పుస్తెలు కూడా తాకట్టు పెడతారు ఇక్కడి ప్రజలు. పులస చేపలను ఎంత ఖరీదైన సరే కొనుగోలు చేసి.. అందులో బెండకాయ ముక్కలు.. పచ్చి మామిడికాయ ముక్కలు.. దోసకాయ ముక్కలు వేసుకుని.. చింతపండు పులుసుతో లొట్టలు వేసుకుంటూ తింటారు. మట్టి గిన్నెలో వండుకొని “ఆహా ఏమి రుచి.. తినరా మై మరచి” అంటూ తినేస్తుంటారు. వర్షాకాలం సీజన్ పూర్తయిన తర్వాత పులస చేపలు అంతగా లభించవు. శీతాకాలం ప్రారంభమైన తర్వాత ఇక్కడ పీతలు లభిస్తుంటాయి. అయితే గోదావరి జిల్లాలో అరుదైన పీతలు ఓ మత్స్యకారుడికి లభించాయి. ఆ పీతల గుడ్లను నీటిలో వదిలితే.. అవి మరింత పెరిగాయి. వందల సంఖ్యలో వృద్ధి చెందాయి. నాలుగు నెలల్లో అవి మంచి సైజుకు వస్తాయట. గోదావరి లోకి ప్రతిరోజు మత్స్యకారులు వేటకు వెళ్తుంటారు. వేటకు వెళ్ళిన ప్రతిసారీ వాళ్లకు చేపలు, రొయ్యలు, పీతలు పడవట. కొన్నిసార్లు వట్టి చేతులతోనే వస్తారట. అరుదైన సందర్భాల్లో పచ్చడి చేపలు లభిస్తాయట. అయితే కాకినాడ జిల్లాలోని ఓ మత్స్యకారుడి వలలో అరుదైన పీతలు పడ్డాయి. కోరంగి ప్రాంతంలోని గోదావరి నదిలో మత్స్యకారులు వలలు వేయగా పీతలు పడ్డాయి. అందులో రెండు కచ్చు పీతలు చిక్కాయట. ఒక్కో పీత రేటు 400 దాకా ఉంటుందట. అయితే వాటి గుడ్ల ద్వారా వేలాది పీతలను వృద్ధి చెందించవచ్చట.
మామూలుగానే ఉన్నాయి..
కచ్చు పీతలు మామూలుగానే ఉంటాయి. వాటి గుడ్లు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి. వీటి ద్వారా వేలాది పీతలను ఉత్పత్తి చేయవచ్చట. కాట్రేనికోన మండలం పండి, పోర అనే గ్రామాలలో పీతలను విస్తారంగా పెంచుతుంటారు. అయితే ఇక్కడ కచ్చు పీతలు అంతగా ఉండవు. ఇటీవల కచ్చు పీతలు లభించడంతో.. వాటి గుడ్ల ద్వారా చిన్న పీతలను పెంచుతున్నారు. ఇవి నాలుగు నెలల్లో అరకిలో నుంచి కేజీ వరకు పెరుగుతాయట. వీటిని కిలో 400 నుంచి 600 వరకు విక్రయిస్తారట. ఎండాకాలంలో అయితే వీటి ధర ఏకంగా 2000 వరకు పెరుగుతుందట. ఆ సమయంలో విదేశాలకు ఎగమతి చేస్తారట. సహజంగా పోర, పండి గ్రామాలలో విస్తారంగా పీతలు సాగవుతుంటాయి. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కేవలం పీతల ద్వారానే మన దేశానికి కోట్లల్లో విదేశీ మారకద్రవ్యం లభిస్తుందని ఇక్కడి మత్స్యకారులు చెబుతున్నారు. పీతల పెంపకం ద్వారా వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని వారు వివరిస్తున్నారు. చేపలు, రొయ్యల పెంపకంతో పోల్చితే పీతల పెంపకానికి ఖర్చు తక్కువగానే ఉంటుంది. పైగా నీటి అవసరం కూడా అంతగా అవసరం ఉండదు. ఇవి ఎటువంటి రోగాలనైనా తట్టుకుంటాయి. ఎలాంటి నీటిలోనైనా జీవిస్తాయి. ఎండాకాలంలో అయితే ఇవి అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంటాయి. వర్షాకాలంలో పిల్లలను ఉత్పత్తి చేస్తుంటాయి. స్వల్ప కాలంలోనే ఎక్కువ పిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యం పీతలకు ఉంటుంది. అందువల్లే వీటి ద్వారా మత్స్యకారులకు ఎక్కువగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో పీతల వినియోగం పెరగడంతో పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అధికంగా పీతలు ఎగుమతి అవుతున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Rare crabs caught by fisherman in godavari districts andhra pardesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com