Rajasthan: రాజస్థాన్ రాష్ట్రం పేరు చెప్తే థార్ ఎడారి గుర్తుకు వస్తుంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనప్పటికీ తక్కువ వర్షపాతం నమోదుకోవడం వల్ల రాజస్థాన్ రాష్ట్రంలో పెద్దగా పంటలు పండవు. దీంతో అక్కడి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో గ్రామాలలో కేవలం వృద్ధులు, మధ్య వయసు ఉన్నవారు మాత్రమే ఉంటారు. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో గుడా కుమవాతన్(Guda kumavathan villlege) అనే గ్రామం ఉంది. ఇది రాజస్థాన్(Rajasthan) రాజధాని జైపూర్ (jaipur) కు 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. ఈ గ్రామంలో నాణ్యమైన తైవాన్ దోసకాయలు, రంగురంగుల క్యాప్సికం మిర్చిలు, ఎర్రటి టమాటా పండ్లు, నోరు ఊరించే పుచ్చకాయలు, స్ట్రాబెరీలు ఈ ప్రాంతంలో పండుతుంటాయి. వాస్తవానికి ఇలాంటి అరుదైన కూరగాయలు, పండ్లు పండాలంటే కచ్చితంగా నీరు కావాలి. కానీ ఇక్కడ రైతులు పాలీహౌస్ ల ద్వారా పంటలు పండిస్తున్నారు. ఈ పంటల కోసం ప్రత్యేకమైన వాతావరణాన్ని కల్పించి.. పాలి హౌస్ లో పంటలు పండిస్తున్నారు.. ఈ ప్రాంతంలోని ఒక్కో రైతుకు పాతికపైన ఫామ్ హౌస్ లు ఉన్నాయంటే అక్కడి రైతుల చైతన్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరు మూడు కోట్ల వరకు ప్రతి సంవత్సరం ఆదాయాన్ని ఆర్జిస్తున్నారంటే మామూలు విషయం కాదు. అందువల్లే ఈ గ్రామాన్ని రాజస్థాన్ రాష్ట్రంలో మినీ ఇజ్రాయిల్ అని పిలుస్తుంటారు. ఇజ్రాయిల్ దేశంలో బిందు, సూక్ష్మ సేద్యం ద్వారా పంటలు పండిస్తారు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న పత్తిలో ఇజ్రాయిల్ దేశం వాటా దాదాపు 20 శాతం వరకు ఉంటుందంటే మాటలు కాదు.
Also Read: మోదీపై ట్రంప్ అభిమానం.. పాడ్‌కాస్ట్‌ను షేర్చేసిన అగ్రరాజ్యాధినేత
వాస్తవానికి గుడా కుమవాతన్ గ్రామం గతంలో పేదరికంతో ఇబ్బంది పడేది. నీళ్లు లేకపోవడంతో పంటలు రైతులు వేలుని పరిస్థితి నెలకొంది.. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన కేమారామ్కీ సూక్ష్మ సేద్యంపై అవగాహన పెంచుకున్నాడు.. పనిలో పనిగా వ్యవసాయ శాఖ అధికారులు రెండు వారాల పరిశీలన కోసం కేమా రామ్కీ ని, ఇతర సిబ్బందిని ఇజ్రాయిల్ పంపించారు..వారు అక్కడి ఫాలీ హౌస్ లు పరిశీలించారు. రైతులు చేస్తున్న ప్రయోగాలను దగ్గరుండి చూశారు. పైగా ఇజ్రాయిల్ , కుమవాతన్ గ్రామంలో ఒక విధంగా వర్షపాతం నమోదు అవుతుంది. దీంతో కుమవాతన్ గ్రామంలో రైతులు ఇజ్రాయిల్ మాదిరిగా ఫాలీ హౌస్ లు ఏర్పాటుచేసి కూరగాయలు, ఇతర పండ్లు పండించడం మొదలుపెట్టారు. పాలిహౌస్ నిర్మాణానికి వ్యవసాయ శాఖ అధికారులు సబ్సిడీ ఇచ్చారు. పాలిహౌస్ నిర్మాణం చేపట్టాలంటే 50 లక్షల దాకా అవుతుంది. విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి రైతులు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టారు. దోసకాయ, టమాటాలు, మిర్చి, వంకాయలు పండించడం ప్రారంభించారు. తొలి రోజుల్లో రైతులు కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. ఆ తర్వాత పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకున్నారు.. ఇప్పుడు ఆ గ్రామంలో దాదాపు 2000 పైగా పాలీహౌస్ లు ఉన్నాయి. కొందరు రైతులు వాటిని అద్దెకు ఇస్తూ చేయడానికి పది లక్షల దాకా సంపాదిస్తున్నారు. మొత్తంగా ఆ గ్రామంలోని రైతులు 300 కోట్ల వరకు సంపాదిస్తున్నారంటే వారి ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: కళ్యాణ్ రామ్ పై విజయశాంతి కీలక కామెంట్స్… వాళ్ళను ఎక్కడ నుండి పట్టుకొస్తాడో తెలియదు అంటూ!