Rain Latest Viral Video: అప్పుడప్పుడు వాతావరణంలో వింతలు చోటుచేసుకుంటాయి. ఒకపక్క ఎండ.. మరోపక్క వర్షం కురుస్తూ ఉంటాయి. ఇది వాతావరణంలో ఏర్పడే భిన్న పరిస్థితుల వల్ల చోటు చేసుకుంటుంది. ఇలాంటి వాతావరణం మనదేశంలో అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాల ప్రారంభంలో ఇటువంటి వాతావరణం మనలో చాలామందికి అనుభవంలో ఉండే ఉంటుంది.. కానీ ఇద్దరు మెక్సికో దేశస్థులకు మాత్రం ప్రపంచంలో ఎవరికీ ఎదురుకాని అనుభవం సొంతమైంది.
అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ అద్భుతాన్ని వీడియో తీశాడు. అంతే సోషల్ మీడియాలోకిఎక్కించడంత క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే ఈ తరహా అనుభవం మాకు ఎన్నడూ ఎదురు కాలేదని ఆ వ్యక్తులు చెబుతున్నారు. అయితే వాతావరణం లో చోటు చేసుకున్న మార్పుల వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మేఘాలు ఏర్పడే క్రమంలో ఏవైనా అవరోధాలు ఎదురైనప్పుడు.. లేదా స్వల్పకాలిక మేఘాలకు చల్లని గాలులు తోడైనప్పుడు ఇలాంటి టార్గెట్ రెయిన్ ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంటున్నారు.
Also Read: ఏడుపదుల వయసులో ఎంతటి అన్యోన్యత… నేటి తరం కళ్లప్పగించి చూడాల్సిన వీడియో
ఈ తరహాలో వర్షాలు ఎక్కువగా ఇండోనేషియా, ఇటలీ ప్రాంతాలలో కురుస్తాయి. గతంలో ఈ ప్రాంతాలలో కురిసిన వర్షాలను కొంతమంది వీడియోలు తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా అందుబాటులో లేని కాలంలో వారు ఇంటర్నెట్లో పొందుపరిచారు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే మెక్సికో లో ఈ తరహాలో వర్షం కురవడం ఇది తొలిసారి కాకపోయినప్పటికీ.. ఆ వ్యక్తుల మీద కురిసిన వర్షాన్ని వీడియో రూపంలో బంధించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. అయితే కొన్ని నిమిషాల పాటు కురిసిన వర్షం ఆ తర్వాత తగ్గిపోయింది. పైగా వర్షం చినుకుల రూపంలో కాకుండా.. బకెట్తో నీళ్లు కుమ్మరించినట్టు కురిసింది. అది ఆ ఇద్దరు వ్యక్తులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ఇద్దరు వ్యక్తులకు ఆతరహా అనుభవం ఎదురు కావడం.. సోషల్ మీడియాలో పడటం.. ఫలితంగా ఆ ప్రాంతానికి చాలామంది వెళ్తున్నారు. వర్షం కురిస్తే ఆస్వాదించాలని భావిస్తున్నారు. కానీ వారి ఆశలు నెరవేరడం లేదు. ఎందుకంటే అక్కడ వర్షం కురవడం లేదు.