Pre Engagement Shoot Video: ‘అది జాతీయ రహదారి( National Highway).. ఖరీదైన కార్లు దూసుకొస్తాయి. ఇలా దిగిన వెంటనే భారీ వస్తాదులు ఆ వాహనాలను చుట్టూ ముడతారు. కారులోంచి అందమైన అమ్మాయి దిగుతుంది. దానికి ఎదురుగా మరికొన్ని ఖరీదైన వాహనాలు వస్తాయి. అలాగే వస్తాదులు చుట్టుముడతారు. టిప్ టాప్ గా ఉండే ఓ యువకుడు సూట్ కేస్ తో దిగుతాడు. అటువైపు ఇటువైపు వస్తాదులు మోహరిస్తారు. ఆ యువకుడు వద్ద ఉన్న సూట్ కేసును ఆ యువతి తీసుకుంటుంది. తెరిచి చూసేసరికి ఒక్కసారిగా మనం షాక్ అవుతాం. ఆ సూట్ కేసులో ఉన్నవి ఏంటో తెలుసా. బంగారం ఉంగరాలు. ఆపై ప్రేమకు చిహ్నమైన గులాబీ పువ్వు’.. ఈ కార్ల హంగామా చూసి మనం ఏదో డాన్ ల మధ్య డీల్ అనుకుంటాం. అది ఫ్రీ ఎంగేజ్మెంట్ షూట్ అట. అది చూసి షాక్ అవడం అందరి వంతు అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. ఫ్రీ ఎంగేజ్మెంట్ షూట్ ఇలా ఉంటే.. వెడ్డింగ్ షూట్ ఎలా ఉంటుందోనని నెటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బ్రూక్ భయ్యా కూడా.. మన పంత్ లాగే.. ఇలా కూడా బ్యాటింగ్ చేస్తారా?
* వివాహ వ్యవస్థలో మార్పులు..
వివాహాల( marriages) తీరు మారింది. ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజేషన్ పేరిట వివాహాల వ్యవస్థలోనే సమూల మార్పులు వచ్చాయి. అప్పట్లో మూడు రోజుల పెళ్లి ఉండేది. కానీ ఇప్పుడు మూడు గంటల్లోనే తంతు పూర్తవుతోంది. దానికి కారణం లేకపోలేదు. మనిషి యాంత్రీకరణ జీవితం ఈ పరిస్థితికి కారణం. సమయాన్ని ఎవరు వృధా చేసుకోవడం లేదు. వస్తున్నారు.. వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. విందు ఉంటే ఆరగించి వెళ్ళిపోతున్నారు. దీంతో వివాహాల్లో నాటి సందడి ఉండడం లేదు. అందుకే ఇప్పుడు ఈవెంట్లు వివాహాల్లో ప్రవేశించాయి. వాటి ద్వారా ఎంతో కొంత సందడి ఉంటుంది.
* గ్రామీణ ప్రాంతాల్లో సైతం..
ముఖ్యంగా ఫ్రీ వెడ్డింగ్ షూట్( free wedding shoot) అనేది గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకింది. కచ్చితంగా ప్రతి వ్యవహానికి ఇప్పుడు ఫ్రీ వెడ్డింగ్ షూట్ ఉండాల్సిందే. పర్యాటక ప్రాంతాలు, బీచ్ లలో ఎక్కువగా ఈ షూటింగులు కనిపిస్తున్నాయి. వధూవరుల అభిరుచులకు తగ్గట్టు.. సరికొత్త రీతిలో ఈ షూట్లు చేస్తున్నారు ఫోటోగ్రాఫర్లు. అచ్చం సినిమా మాదిరిగానే.. ఎంత మాత్రం తగ్గకుండా.. ఖర్చుకు వెనుకడుగు వేయకుండా ఇలా ఫ్రీ వెడ్డింగ్ షూట్ లు తీస్తుండడం విశేషం. ప్రస్తుతం ప్రతి గ్రామానికి వీడియో గ్రాఫర్ అందుబాటులో ఉంటున్నారు. ఇదో లాభసాటి ఉపాధి మార్గంగా కూడా నిలుస్తోంది. అయితే ఏకంగా సినిమాలకు తలదన్నే రీతిలో ఫ్రీ వెడ్డింగ్ షూట్ లు తీస్తుండడం విశేషం. అచ్చం మాఫియా డాన్ల తరహాలో తాజాగా తీసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. ఎంగేజ్మెంట్ కి ఈ తరహాలో ఉంటే.. వివాహానికి ఏ తరహాలో ప్లాన్ చేస్తారో నన్న చర్చ అయితే నడుస్తోంది.
Just a photoshoot… to announce an engagement ceremony ! pic.twitter.com/eEcL3sDh0I
— Naresh Nambisan | നരേഷ് (@nareshbahrain) August 13, 2025