Harry Brooke Six: బ్రూక్.. ఇటీవల భారత జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ముఖ్యంగా ఐదో టెస్టులో అద్భుతమైన సెంచరీ చేసి దాదాపు ఇంగ్లాండ్ జట్టును గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. అంతర్జాతీయ సుదీర్ఘ ఫార్మాట్లో రెండవ స్థానంలో కొనసాగుతున్న బ్రూక్.. అదే రేంజ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ లోనూ టీ 20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.. ఇండియాతో టెస్ట్ సిరీస్ అయిన తర్వాత బ్రూక్ ప్రస్తుతం ది హండ్రెడ్ లీగ్ అనే టోర్నీలో ఆడుతున్నాడు.. ఈ టోర్నీలో బ్రూక్ ఒక దిమ్మ తిరిగే షాట్ కొట్టాడు. అతడు కొట్టిన షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
Also Read: గంభీర్ కు ఉద్వాసన.. టీమిండియా టెస్ట్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్..
టిమ్ సౌథి బౌలింగ్లో బ్రూక్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. క్రేజీ సిక్సర్ కొట్టాడు. సౌథి వేసిన బంతిని బ్రూక్ స్కూప్ షాట్ కొట్టాడు. తర్వాత కింద పడిపోయాడు. సరిగ్గా అతను కొట్టిన షాట్ కనెక్ట్ కావడంతో బంతి బౌండరీ లైన్ ను సరిగ్గా తగిలింది. ఈ మ్యాచ్లో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ ఐదు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో రంగంలోకి దిగిన బర్మింగ్ హమ్ ఫినిక్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్లో సూపర్ చార్జెస్ జట్టు 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.
నార్తర్న్ జట్టు తరఫున ఆడిన బ్రూక్ 14 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 31 పరుగులు చేశాడు. క్రావ్ లే 45, మలాన్ 58, పెప్పర్ 28 పరుగులు చేశారు. బర్మింగ్ హమ్ జట్టు తరఫున లివింగ్ స్టోన్ 46, బెతెల్ 48 పరుగులు చేశారు. మిగతా ప్లేయర్లు మొత్తం విఫలమయ్యారు. నార్తర్న్ జట్టు తరఫున మాథ్యూ 3, డఫీ, ఆదిల్ రషీద్ చెరి 2 వికెట్లు సాధించారు. కాగా, బ్రూక్ ఈ మ్యాచ్లో సిక్సర్ కొట్టిన విధానాన్ని భారత అభిమానులు మరో విధంగా సంబోధిస్తున్నారు. బ్రూక్ ఇటీవల ఇండియా పై టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు.. రిషబ్ పంత్ ను దగ్గరగా గమనించి ఉంటాడని.. అందువల్లే పంత్ ఆడినట్టుగా స్కూప్ షాట్ కొట్టాడని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తాన్నారు.. ఎందుకంటే రిషబ్ పంత్ కు ఇలాంటి స్కూప్ షాట్లు ఆడటం కొట్టినపిండి.
HARRY BROOK !!!!!!!!!!#TheHundred pic.twitter.com/Zd6vXz9pS0
— The Hundred (@thehundred) August 15, 2025