Pawan Kumar Shah: జీవితం ఒక్కోసారి ఎటువైపు వెళుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు ఊహించని మలుపుల వైపు జీవితాన్ని కాలం తీసుకెళ్తుంది. అందులో కొంతమంది విజయవంతం అయితే.. మరి కొంతమంది విఫలమవుతుంటారు. విజయవంతమైన వారు సరికొత్త చరిత్రను సృష్టిస్తారు. సువర్ణ అక్షరాలతో లిఖించదగిన అద్భుతాలను తమ పాదక్రాంతం చేసుకుంటారు. ఆ జాబితాలో ఇతడికి మొదటి స్థానం ఇవ్వచ్చు.
కోవిడ్ సమయంలో చాలామంది జీవితాలు తలకిందులైపోయాయి. ఊహించని మలుపులు తీసుకొని.. అంచనా వేయలేని కష్టాలను కళ్ళ ముందు ఉంచాయి. ఆ కష్టాలను దాటుకొని.. కన్నీళ్లను దిగమింగుకొని ముందుకు వెళ్లినవారు విజయవంతమయ్యారు. జీవితంలో సరికొత్త శిఖరాలను అధిరోహించారు.
అతడి పేరు పవన్ కుమార్ షా. చదివింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ ప్రాంతంలో ఇంజనీర్ గా రెండు సంవత్సరాల పాటు పని చేసాడు. కరోనా వల్ల కంపెనీ బయటికి పంపించడంతో ఇంటికి వచ్చాడు. ఇంటిదగ్గర ఏ పని చేయాలో తెలియక ప్రత్యామ్నాయం గురించి ఆలోచించారు. ఈ కార్యక్రమంలో చేపల పెంపకాన్ని సాగించాలని నిర్ణయించుకున్నాడు.. దానికి తగ్గట్టుగా స్టార్టప్ ఏర్పాటు చేసుకున్నాడు. మామూలు కుటుంబం నుంచి వచ్చిన అతడు.. మూతబడి ఉన్న అద్దెకు తీసుకున్నాడు. కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకాన్ని మొదలుపెట్టాడు.
మార్కెట్ స్థితిగతులను అంచనా వేసి లైవ్ ఫిష్ అందుబాటులోకి తీసుకొచ్చాడు. తద్వారా వినియోగదారులను ఆకట్టుకున్నాడు. క్రమంగా అతని వ్యాపారం జరిగింది.. ఇరుగుపొరుగు జిల్లాలను దాటి ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలకు విస్తరించింది. ప్రస్తుతం అతడు నత్తల ఉత్పత్తి కూడా మొదలు పెట్టాడు. ప్రత్యక్షంగా 20 మందికి, పరోక్షంగా 50 మందికి అతడు ఉపాధి కల్పిస్తున్నాడు. చేపల పెంపకంలో రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నాడు. సీడ్ ఏజెన్సీ కూడా ఏర్పాటుచేసి అదనంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.
కరోనా సమయంలో చాలామంది స్నేహితులు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. పవన్ కూడా కొన్ని సందర్భాలలో అలానే అవస్థ పడ్డాడు. చివరికి తన మీద తానే ప్రయోగాలు చేసుకున్నాడు. అందులో విజయవంతమయ్యాడు. ఒకప్పుడు ఒకరి దగ్గర పనిచేస్తున్న అతడు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. కరోనా వల్ల జీవితమంటే ఎలా ఉంటుందో పవన్ కుమార్ అధ్యయనం చేశాడు. అందులో విజయవంతమయ్యాడు.