Rajasthan Man Over Sleeping: సాధారణంగా ప్రతి మనిషి రోజుకు 6 నుంచి 7 గంటలు శయనిస్తే సరిపోతుందని వైద్యులు అంటుంటారు. చిన్నపిల్లలు రోజులో దాదాపు 12 గంటల వరకు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతుంటారు. కానీ రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ వ్యక్తి నెలలో 25 రోజులపాటు నిద్రలోనే ఉంటున్నాడు. ఇలా నిత్యం నిద్రపోతూ ఉండడంతో అతడిని అభినవ కుంభకర్ణుడు అని పిలుస్తున్నారు.
Also Read: అర్ధరాత్రి పూట అవినాష్ రెడ్డి అరెస్టు.. పులివెందులలో ఏం జరుగుతోంది..
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పూర్ణ రామ్ అనే వ్యక్తికి ప్రస్థానం 46 సంవత్సరాలు. అతడికి 23 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఇలా నిద్ర మొదలైంది. అలా అతడు నిద్రపోతూనే ఉన్నాడు. నెలలో దాదాపు 25 రోజులపాటు అతడు నిద్రపోతూనే ఉంటాడు. అయితే ఇది వ్యాధి అని.. దాని పేరు యాక్సిస్ హైపర్ సోమ్నియా అని వైద్యులు చెబుతున్నారు. ఇది నరాల బలహీనతకు సంబంధించిన వ్యాధి అని.. వైద్యులు అంటున్నారు. నెలలో 25 రోజులపాటు అతడు నిద్రపోతూనే ఉంటాడని.. నిద్రలోనే అతనికి కుటుంబ సభ్యులు అన్నం తినిపించడం.. స్నానం చేయించడం వంటివి చేస్తుంటారు. ఇక మిగతా ఐదు రోజుల్లో అతడు తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు.
ఇలా దాదాపు 23 సంవత్సరాలుగా అతడు ఇలా అతినిద్రతో బాధపడుతూనే ఉన్నాడు. ఎంతోమంది వైద్యులను కలిసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ వ్యాధికి చికిత్స అంటు లేకపోవడంతో.. అతడు అలాగే నిద్రపోతున్నాడు. ఇది జన్యుపరమైన వ్యాధి కావడంతో చికిత్స ఇవ్వడం అంత సులువు కాదు అని వైద్యులు చెబుతున్నారు. ఏడాదిలో 300 రోజులపాటు నిద్రలో ఉండటం వల్ల పూర్ణారామ్ వ్యాపారం అంతంత మాత్రం గానే సాగుతుంది. పూర్ణ రామ్ పరిస్థితి తెలిసిన కుటుంబ సభ్యులు అతని వ్యాపారాన్ని వారే కొనసాగిస్తున్నారు..