Homeవింతలు-విశేషాలుJapan Zoo Heartwarming Story: తల్లి వదిలేసింది..ఈ బొమ్మే అమ్మయింది.. హృదయ విదారక కథ ఇది!

Japan Zoo Heartwarming Story: తల్లి వదిలేసింది..ఈ బొమ్మే అమ్మయింది.. హృదయ విదారక కథ ఇది!

Japan Zoo Heartwarming Story: ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు. తల్లి ప్రేమ ముందు ఏదీ సాటి రాదు. అందుకే అమ్మ ఉన్నచోట ప్రేమ ఉంటుంది.. అమ్మ లాలనలో ప్రేమ ధ్వనిస్తుంది అంటారు. కేవలం మనుషులకే కాదు.. పశువులకు, పక్షులకు, సమస్త జగతికి తల్లి ప్రేమ అనేది ఒక వరం. తల్లి ప్రేమలో జీవితం గొప్పగా ఉంటుంది. తల్లి ఇచ్చే ముర్రుపాలలో శక్తి ఉంటుంది. ఆమె తినిపించే గోరుముద్దల్లో ఆప్యాయత కనిపిస్తుంది. ఇలా ప్రతి […]

Japan Zoo Heartwarming Story: ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు. తల్లి ప్రేమ ముందు ఏదీ సాటి రాదు. అందుకే అమ్మ ఉన్నచోట ప్రేమ ఉంటుంది.. అమ్మ లాలనలో ప్రేమ ధ్వనిస్తుంది అంటారు. కేవలం మనుషులకే కాదు.. పశువులకు, పక్షులకు, సమస్త జగతికి తల్లి ప్రేమ అనేది ఒక వరం.

తల్లి ప్రేమలో జీవితం గొప్పగా ఉంటుంది. తల్లి ఇచ్చే ముర్రుపాలలో శక్తి ఉంటుంది. ఆమె తినిపించే గోరుముద్దల్లో ఆప్యాయత కనిపిస్తుంది. ఇలా ప్రతి సందర్భంలో ప్రతి జీవి మనుగడ తల్లి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అమ్మ అన్నది ఒక బంగారు మాట.. ఆమె లాలనలో ప్రతిదీ మమతల తోట అని వెనకటికి ఒక కవి చెప్పాడు.

తల్లి ప్రేమకు దూరమైన వారు నిర్వేదంలో ఉంటారు. నిరాశతో కనిపిస్తుంటారు. ప్రతిక్షణం ప్రేమరాహిత్యంలో వేదన చెందుతూ ఉంటారు. కేవలం మనుషులే కాదు.. జంతువులు కూడా ఇలానే బాధపడుతుంటాయి. అందువల్లే తల్లి చెంతనే ఉండాలి. ఆమె ప్రేమ ఓల లాడించాలి అంటారు పెద్దలు. తల్లి ప్రేమకు దూరమైతే మనుషులే కాదు.. చివరికి జంతువులు కూడా తీవ్రంగా బాధపడుతుంటాయి. మనుషులైతే ఏదో ఒక వ్యాపకంతో ఆ బాధ నుంచి దూరం జరుగుతుంటారు. కానీ, జంతువులకు అటువంటి వెసలు బాటు ఉండదు. అవి ఆ బాధలో నిత్యం వేదన చెందుతూనే ఉంటాయి.

జపాన్ దేశంలో ఇచి కవా అనే జంతు సంరక్షణ కేంద్రం ఉంది. అక్కడ పంచ్ అనే కోతి ఆశ్రయం పొందుతోంది. పంచ్ పుట్టిన తర్వాత తల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తల్లి వదిలేయడంతో పంచ్ ఒంటరి అయిపోయింది. ఆహారం తీసుకోవడం మానేసింది. నీరు తాగడం పక్కనపెట్టింది. బక్క చిక్కిపోతున్న ఆ చిన్ని ప్రాణాన్ని చూసి జూ నిర్వాహకుల గుండె తరుక్కుపోయింది. దీంతో వారు ఒక బొమ్మ కోతిని పంచ్ కు ఇచ్చారు.

పంచ్ ఆ బొమ్మ కోతిని తన తల్లి అనుకుంటున్నది. ఆ బొమ్మ కోతి ఒడిలోనే సేద తీరుతోంది. ఆ బొమ్మ కోతితో ఆటలాడుతోంది. బొమ్మ కోతి తన వద్దకు వచ్చిన నాటి నుంచి పంచ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. ఇచ్చిన ఆహారాన్ని తింటున్నది. నీటిని తాగుతున్నది. అంతేకాదు ఆ జూ లో స్వేచ్ఛగా విహరిస్తున్నది.. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనం కలిగిస్తోంది.

“తల్లి ప్రేమకు దూరమైన పంచ్ తీవ్రమైన వేదనలో ఉంది. దానికోసం జూ నిర్వాహకులు బొమ్మ కోతిని ఇచ్చారు. ఆ బొమ్మతో పంచ్ ఆటలాడుతోంది. స్వేచ్ఛగా విహరిస్తోంది. తల్లి ప్రేమను ఆ బొమ్మ రూపంలో ఆస్వాదిస్తోంది. జూ నిర్వాహకులకు వచ్చిన ఈ ఆలోచన అద్భుతంగా ఉందని” నెటిజన్లు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper