Oscar Awards 2025 : బిగ్ బ్రేకింగ్ : ‘ఆస్కార్స్’ కి ప్రభాస్ కల్కి..రేసులో పోటీ పడుతున్న మరో రెండు తెలుగు సినిమాలు!

ఆస్కార్ అవార్డ్స్ 2025 ' కి గాను మన టాలీవుడ్ నుండి మూడు చిత్రాలను ఆస్కార్స్ కి పంపేందుకు పరిశీలిస్తున్నారు . అందులో మొదటిది ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ 'కల్కి'. మన పురాణాలకు సైన్స్ ఫిక్షన్ ని జోడించి హాలీవుడ్ స్థాయి లో ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ వంశీ తెరకెక్కించాడు. థియేటర్స్ లోకి అడుగుపెట్టి ఈ సినిమాని చూస్తున్న ప్రేక్షకులకు ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అద్భుతమైన అనుభూతిని ఈ చిత్రం కల్పించింది.

Written By: Vicky, Updated On : September 23, 2024 7:17 pm

Oscar Awards 2025

Follow us on

Oscar Awards 2025 : తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇప్పుడు జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుకుంటూ హాలీవుడ్ సినిమాలతో సైతం పోటీ పడే రేంజ్ కి ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే. మన చిత్ర పరిశ్రమకు ఆ స్థాయి కీర్తి ప్రతిష్టలు రావడానికి ముఖ్య కారణం రాజమౌళి అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మగధీర చిత్రం నుండి ఆయన తీసే సినిమాలు మన టాలీవుడ్ స్థాయిని పెంచేలా చేసాయి. ఇక #RRR చిత్రం తో అయితే ఆయన ఏకంగా మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు ని తీసుకొచ్చాడు. #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం తో మన తెలుగు సినీ పరిశ్రమపై అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సినీ ప్రముఖులు, టెక్నీషియన్స్ ప్రత్యేకమైన దృష్టిని సారించారు. మన తెలుగు సినిమాలను చూడడం మొదలు పెట్టారు.

ఒకప్పుడు ‘ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ మన తెలుగు సినిమాలను ఆస్కార్ అవార్డ్స్ కి పంపేందుకు పరిగణించేవారు కాదు. కానీ ఇప్పుడు మన ఇండస్ట్రీ కి ఇతర ఇండస్ట్రీ లో తో పాటు సమానమైన స్థానాన్ని కల్పించారు. ఇది ఇలా ఉండగా ‘ఆస్కార్ అవార్డ్స్ 2025 ‘ కి గాను మన టాలీవుడ్ నుండి మూడు చిత్రాలను ఆస్కార్స్ కి పంపేందుకు పరిశీలిస్తున్నారు . అందులో మొదటిది ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘కల్కి’. మన పురాణాలకు సైన్స్ ఫిక్షన్ ని జోడించి హాలీవుడ్ స్థాయి లో ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ వంశీ తెరకెక్కించాడు. థియేటర్స్ లోకి అడుగుపెట్టి ఈ సినిమాని చూస్తున్న ప్రేక్షకులకు ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అద్భుతమైన అనుభూతిని ఈ చిత్రం కల్పించింది. అందుకే ఈ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమాని ఆస్కార్ అవార్డ్స్ కి ఎంపిక చేయడం మంచి నిర్ణయం. కచ్చితంగా ఎదో ఒక క్యాటగిరీ లో ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

ఇక ఆస్కార్ అవార్డ్స్ కి పంపేందుకు పరిశీలనలో ఉన్న మరో చిత్రం ‘హనుమాన్’. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఒక చిన్న సినిమాగా వచ్చిన ‘హనుమాన్’ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం 20 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీసిన ఈ సినిమాని చూసే ఆడియన్స్ కి 200 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టుగా అనిపించింది. ఈ ప్రతిభని ఆస్కార్ అవార్డ్స్ ఎంపికకు గుర్తించడం ఉత్తమమైన నిర్ణయం. ఇక ఆస్కార్ అవార్డ్స్ కి ఎంపిక కాబడిన మూడవ చిత్రం ‘మంగళవారం’. అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషించింది. విభిన్నమైన కథాంశం తో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా కూడా ఆస్కార్ అవార్డ్స్ కి పంపేందుకు పరిశీలిస్తున్నారు. ఈ మూడు సినిమాల్లో ఎదో ఒకటి ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ కి వెళ్లే అవకాశం ఉంది.